విశాఖ ప్రమాదంపై సిఎం జగన్ ఆరా

July 14, 2020 at 10:36 am
x

విశాఖ ఫార్మా సిటీలో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. వరుస ప్రమాదాలతో విశాఖలో అలజడి రేగుతుంది. ఈ ప్రమాదం తీవ్రత దెబ్బకు అక్కడి పది గ్రామాలు అల్లాదిపోయాయి. ఈ తీవ్రతలో ఎంత మంది గాయపడ్డారు అనేది కూడా ఒక అంచనాకు రాలేని పరిస్థితి. గత మూడు నెలల కాలంలో ఇది అత్యంత పెద్ద ప్రమాదంగా చెప్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఏంటీ అనేది తెలియలేదు.

ఎంత మంది గాయపడ్డారు అనే దానిపై పూర్తి స్థాయిలో సమాచారం రావడం లేదు. దీనిపై సిఎం వైఎస్ జగన్ ఆరా తీసారు. ఆయన మంత్రి మేకపాటి గౌతం రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విశాఖలో ఈ ప్రమాదంపై కేంద్రం కూడా ఆరా తీసింది. ప్రమాద పరిసర గ్రామాల్లోని ప్రజలకు సహాయక చర్యలు అందించాలి అని వారిని అవసరం అనుకుంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని మంత్రికి సూచించారు.

 

ఎవరు అయినా గాయపడితే వారికి మెరుగైన చికిత్స అందించాలి అని సిఎం ఆదేశించారు. ఇక ఈ ప్రమాదంకి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక కూడా సిఎం జగన్ అడిగారు అని సమాచారం. జిల్లా కలెక్టర్ తో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సమావేశం అయి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విశాఖ ప్రమాదంపై సిఎం జగన్ ఆరా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts