రఘుకి ప్లాన్ సిద్దం చేసిన సిఎం జగన్, ఇక చుక్కలే…!

July 2, 2020 at 3:39 pm

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి ఇప్పుడు ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఆయన ఏది మాట్లాడినా సరే కొన్ని మీడియా పత్రికలూ కాస్త ఆసక్తిగా వినడం ఆయనకు లేని పోనీ ప్రచారం కల్పించడం, టీడీపీ సోషల్ మీడియా కూడా ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు కాస్త ఆశ్చర్యంగా మారింది అనే చెప్పాలి. ఇక ఆయన కాస్త శృతి మించి విమర్శలు చేస్తున్నారు.

 

ఈ నేపధ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయించడానికి అధికార పార్టీ ఎంపీలు సిద్దమయ్యారు. 21 మంది ఎంపీలు లాయర్లతో కలిసి ఢిల్లీ విమానం ఎక్కుతున్నారు రేపు. వారికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. వారు వెళ్లి ఆయనకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఒక లేఖ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయన ఏం చేస్తారు అనేది చూడాలి.

 

సిఎం జగన్ ఆదేశాలతోనే ఆయనకు చెక్ పెట్టే దిశగా ఇప్పుడు ఎంపీలు అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన దీనిపై స్పందించారు. విమానం ఉంది కదా అని వెళ్తున్నారు అని ఏమీ కాదని అన్నారు. తాను జగన్ ని ఏమీ అనలేదని అన్నారు. ఇదంతా వృధా ప్రయాస అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రయత్నంఫలించదు అని అన్నారు. ఇక ఆయనపై చర్యలకు సిఎం జగన్ సిద్దం కావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

రఘుకి ప్లాన్ సిద్దం చేసిన సిఎం జగన్, ఇక చుక్కలే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts