అవినీతి జాబితా రెడీ చేసిన జగన్… త్వరలో చుక్కలే

July 15, 2020 at 3:01 pm

ఆంధ్రప్రదేశ్ లో సిఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిఎం వైఎస్ జగన్ కాస్త అవినీతి విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు అనే సంగతి తెలిసిందే. ఏ మాత్రం కూడా అవినీతిని ఆయన సొంత పార్టీ నేతల విషయంలో కూడా క్షమించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేస్తున్నారు. పార్టీలో ఏ నేత అయినా సరే అవినీతి చేయడానికి వీలు లేదు అని ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే సిఎం వైఎస్ జగన్ ఇన్ని రోజులు… విపక్షాల నేతల అవినీతి మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు సొంత పార్టీ నేతల అవినీతి మీద ఫోకస్ చేస్తున్నారు. అవినీతి ఎవరు చేసినా అవినీతే అంటూ సిఎం ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ద్వారా విపక్షాలు ఆరోపణలు చేస్తున్న వారిని టార్గెట్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఎవరు అయితే అవినీతికి పాల్పడే అవకాశం ఉందో వారిని గుర్తిస్తున్నారు.

 

ఆరుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ సహా కొందరిని గుర్తించారు. ఇద్దరు మంత్రులకు సిఎం జగన్ వార్నింగ్ ఇచ్చినా సరే పరిస్థితిలో మార్పు రాలేదు. దీనితో ఇప్పుడు ఆయన ఇక స్వయంగా రంగంలోకి దిగి అరెస్ట్ కూడా చేయించే ఆలోచన చేస్తున్నారట. ఒక ఎమ్మెల్యే మార్చుకున్నారు గాని మరో ఎమ్మెల్యే మాత్రం తాను అవినీతి చేయడం లేదు అని తన పార్టనర్ తెలంగాణా ఎమ్మెల్యే అని, ఇద్దరు కలిసి ఏపీలో వ్యాపారం చేస్తున్నామని చెప్పారట.

అవినీతి జాబితా రెడీ చేసిన జగన్… త్వరలో చుక్కలే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts