వచ్చే ఏడాది జియో 5జీ వచ్చేస్తుంది: అంబానీ ప్రకటన

July 15, 2020 at 5:31 pm

భారత్ లో 5 జీ ఎప్పుడు వస్తుంది…? ఫోన్ లు వస్తున్నాయి గాని సిం లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది చెప్పలేని పరిస్థితి. 5 జీ నెట్ వర్క్ ని లాంచ్ చేసే అవకాశాల మీద చాలానే అనుమానాలు ఉన్నాయి. ఏ సంస్థ ముందుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. చాలా సంస్థలు ఇప్పుడు ముందుకు వస్తున్నా సరే భారీగా హక్కులకు సంబంధించిన ఖర్చులు ఉండటంతో వెనక్కు తగ్గుతున్నాయి.

ఇక జియో మాత్రం సొంతగా ఆ పరిజ్ఞానం అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇది పక్కన పెడితే తాజాగా జియో కీలక ప్రకటన చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తమ కంపెనీ 5జీ సిస్టంను సిద్ధం చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ మీడియాకు వెల్లడించారు. బుధవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దీనిపై కీలక వ్యాఖ్యలు చేసారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 5జీ వ్యవస్థను విడుదల చేస్తామని అన్నారు.

 

సున్నా నుంచి ఈ 5జీ వ్యవస్థను తయారుచేశామని ఆయన చెప్పారు. 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే దీని ట్రయల్స్ ప్రారంభిస్తామని ఆయన వివరించారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ కొత్త 5జీ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తాజాగా మీడియాకు వివరించారు. దీనితో ఈ ప్రకటన ఒక్కసారిగా సంచలనంగా మారింది.

వచ్చే ఏడాది జియో 5జీ వచ్చేస్తుంది: అంబానీ ప్రకటన
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts