జ‌గ‌న్‌పై ‘ క‌మ్మ ‘ వ‌ర్గం కొత్త ప్ర‌చారం ఏంటి…. సీఎంవో చేతిలో భారీ ర‌హ‌స్యం..?

July 29, 2020 at 8:00 pm

ఏపీ సీఎం జ‌గ‌న్ చెబుతున్న దానికీ బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఏమైనా సంబంధం ఉందా ? ఆయ‌న చెబుతున్న మాట‌ల‌ను, చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను.. బ‌య‌టి ప్ర‌పంచానికి ఉద్దేశ పూర్వకంగానే త‌ప్పుడు సంకేతాలు ఇచ్చేలా కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నాయి ముఖ్య‌మంత్రి కార్యాల‌య వ‌ర్గాలు. క‌రోనా విష‌యంలో జ‌గ‌న్ చెబుతున్న మాట‌లు ఇటీవ‌ల కాలంలో తీవ్ర‌స్థాయిలో వివాదాస్ప‌దం అవుతున్నాయి. నిజానికి ఆయ‌న ఏం చెబుతున్నారో.. చూద్దాం.. క‌రోనా ఎవ‌రికైనా వ‌స్తుంది.. అది చిన్న‌పాటి జ్వ‌రం లాంటిదే.. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే త‌గ్గిపోతుంది. ముందుగా దీనిపై భ‌యం వ‌ద్దు.. అంత‌కుమించి ఆందోళ‌న అస‌లే వ‌ద్దు.. అని అంటున్నారు.

అంతేకాదు, క‌రోనా విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని, ఇంట్లోనే ఉంటే.. ఇది పూర్తిగా న‌య‌మైపోతుంది. లేదా.. స‌మీపంలోని కొవిడ్ సెంట‌ర్ల‌ను సంప్ర‌దించినా.. టెలీ మెడిస‌న్‌ను వినియోగించుకున్నా.. ప్ర‌భుత్వం నుంచి అన్ని ర‌కాలుగా సాయం అందుతుంది. ఈరోజు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింది. రేపు నాకే వ‌చ్చినా.. ఆశ్చ‌ర్యం లేదు-ఇదీ జ‌గ‌న్ చెబుతున్న మాట‌లు. జ‌గ‌న్ క‌రోనా వ్యాప్తి ప్రారంభ ద‌శ‌లోనే చెప్పిన ఈ మాట‌ల‌ను అప్ప‌ట్లో విప‌క్ష పార్టీలు అన్ని తీవ్రంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేశాయి. చివ‌ర‌కు క‌రోనా జోరు ఎప్ప‌ట‌కీ త‌గ్గ‌క‌క‌పోగా.. రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో దేశ‌వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పాటు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ సైతం ఈ విష‌యాన్ని అంగీక‌రించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో కీల‌క స్థానాల్లో ఉన్న కొంద‌రు అధికారులు మాత్రం జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఓ వ‌ర్గం మీడియాకు వ్య‌తిరేక భావ‌న‌లో ఉప్పందిస్తున్నారు. దీంతో ఇప్ప‌టికే జ‌గ‌న్‌పై పీక‌ల వ‌ర‌కు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఈ మీడియా మ‌రింత‌గా ఆ మాట‌ల‌కు మ‌సాలా క‌లిపి ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక భావ‌న వ‌చ్చేలా వార్త‌లు అచ్చోస్తోంద‌నేది సీఎంవో సేక‌రించిన స‌మాచారం. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ప‌నిచేసిన ఓ వ‌ర్గం అధికారులు ముఖ్యంగా చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు ఇప్ప‌టికీ వివిధ శాఖ‌ల్లో ప‌నిచేస్తున్నారు. వీరంతా త్వ‌ర‌లోనే రిటైర్ కానున్నారు. అయితే, వీరంతా జ‌గ‌న్ కు వ్య‌తిరేకుల‌నే ముద్ర ఎప్ప‌టి నుంచో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. వారి నిబ‌ద్ధ‌త‌కు మెచ్చిన జ‌గ‌న్ వారిని కొన‌సాగిస్తున్నారు.

ఎలాగూ రిటైర్ అవుతున్నాం కాబ‌ట్టి.. జ‌గ‌న్‌పై త‌మ‌కున్న వ్య‌తిరేక‌త‌ను ఏదో ఒక‌ర‌కంగా బ‌య‌ట పెట్టాల‌నే దురుద్దేశంతో ఇలా వారు వ్య‌వ‌హ‌రిస్తున్నారని, జ‌గ‌న్ ఏ విష‌యంపై అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకున్నా.. ఆయా విష‌యాల‌ను లీకు చేస్తున్నార‌ని తాజాగా సీఎంవోకు తెలిసింది. దీంతో విష‌యాల‌ను సేక‌రించిన అధికారులు దీనిని జ‌గ‌న్ ముందు పెట్ట‌నున్న‌ట్టు ఉన్న‌తాధికారుల నుంచే తెలుస్తోంది. త్వ‌ర‌లోనే వీరిని ఆయా విధుల నుంచి త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిని కూడా గ‌తంలో సీఎస్‌గా చేసిన ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని సాగ‌నంపిన‌ట్టే సాగ‌నంపుతార‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో ? చూడాలి.

జ‌గ‌న్‌పై ‘ క‌మ్మ ‘ వ‌ర్గం కొత్త ప్ర‌చారం ఏంటి…. సీఎంవో చేతిలో భారీ ర‌హ‌స్యం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts