కన్నానే తప్పుకున్నారా…?

July 28, 2020 at 10:02 am

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చడం సంచలనంగా మారింది. ఆయనను అసలు ఎందుకు మార్చారు అనేది స్పష్టత రావడం లేదు. ఈ పరిణామం వెనుక అసలు జరిగింది ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. కరోనా తీవ్రత ఉన్న సమయ౦లో చోటు చేసుకున్న ఈ రాజకీయ పరిణామం సంచలనమే ఇప్పుడు. అయితే కన్నానే తప్పుకున్నారు అన పలువురు అంటున్నారు.

కన్నా తీవ్ర ఒత్తిడి లో ఉన్నారు అని, ఇటీవల కోడలి మరణం ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది అని అంటున్నారు. అందుకే ఆయన బిజెపి అధిష్టానం కు తాను రాజీనామా చేస్తా అని చెప్పారు అని అంటున్నారు. అందుకే సైలెంట్ సోమవారం సాయంత్రం ఈ మార్పు జరిగింది అని అంటున్నారు. ఈ పరిణామం వెనుక చోటు చేసుకున్న పరిణామాలపై ఏ విధంగా చర్చలు జరిపినా సరే అసలు విషయం తెలియడం లేదు.

 

ఇప్పుడు ఆయనను రాజీనామా చేయమని కొందరు ఒత్తిడి చేసారు అని అంటున్నారు. ఇక బిజెపి అధిష్టానం కూడా ఆయన పని తీరు మీద అసహనంగా ఉంది అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే, ఆయనకంటే బలహీనమైన సోము వీర్రాజు ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం వెనుక బిజెపి వ్యూహం ఏంటీ అనేది ఇప్పుడు ఎవరికి అర్ధం కావడం లేదు.

కన్నానే తప్పుకున్నారా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts