సిఎం జగన్ కార్యక్రమంపై కర్ణాటక ఆరా…?

July 2, 2020 at 4:09 pm

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 108 వాహనాలను పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో లేని విధంగా ప్రారంభి౦చింది. ఎన్నడు లేని విధంగా ఈ కార్యక్రమం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇలాంటి కార్యక్రమం చేయలేదు. వైసీపీ సర్కార్ వేసిన ఈ అడుగు చూసి ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి కూడా. ఇక ఇప్పుడు ఈ పథకం కర్ణాటక సర్కార్ కి బాగా నచ్చింది.

 

కర్ణాటక నుంచి వైద్య శాఖ అధికారులు కొందరు ఏపీ వచ్చే అవకాశం ఉంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అక్కడి సిఎం దీని గురించి నిన్న సాయంత్రం ఆరా తీసారు అని, వాటిని అందించిన కంపెనీ తో ఇప్పటికే అక్కడి కీలక అధికారులు మాట్లాడారు అని వార్తలు వస్తున్నాయి. కర్ణాటక లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు చాలా తక్కువ. తమిళనాడు సరిహద్దు జిల్లాలు అన్నీ కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి.

 

సేలం ఈరోడ్ జిల్లాలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అదే విధంగా ఏపీ సరిహద్దు ని పంచుకున్న జిల్లాల్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. అందుకే ముందు వంద అంబులెన్స్ లను సిద్దం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలి అని సిఎం భావిస్తున్నారు అని ఇది త్వరలోనే అందుబాటులోకి రావొచ్చు అని పరిశీలకులు అంటున్నారు.

సిఎం జగన్ కార్యక్రమంపై కర్ణాటక ఆరా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts