`ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం`.. కార్తికేయతో చిరు వీడియో!!

July 16, 2020 at 11:17 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌పంచ‌దేశాలు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లితం ద‌క్క‌డం లేదు. ఈ క్ర‌మంలోనే రోజురోజుకు రికార్డుస్థాయిలో కేసులు పెరుగుతుండడంతో ఆందోళన క‌లిగిస్తోంది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1.34 కోట్లకు పైగా చేరాయి. అటు, కరోనా మరణాల సంఖ్య 5.82 లక్షలు దాటింది.

అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో మాస్క్ ధ‌రించ‌డం ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇప్పటికే పలుసార్లు వీడియోల రూపంలో సందేశం ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో `మీసాలు మెలేయడం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం` అని పేర్కొంటూ, ఆయన మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వీడియో రూపంలో యంగ్ హీరో కార్తికేయ‌తో క‌లిసి చిరు సందేశం ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా చిరు మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ ఈ నెల 13న ఓ విషయాన్ని తెలిపారని ఆయన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులు మరింత పెరిగిపోతాయని చెప్పారని గుర్తు చేశారు. దీన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి ప్రబలకుండా తమ వంతు కృషి చేయాలని, కరోనా సంక్రమణకు ముగింపు పలకాలని చెప్పారని చిరు తెలిపారు. కాబ‌ట్టి, మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి.. ప్లీజ్ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

`ముఖానికి మాస్కులు ధరించడం వీరుడి లక్షణం`.. కార్తికేయతో చిరు వీడియో!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts