రాజమండ్రి జైలుకు కొల్లు రవీంద్ర..!!

July 4, 2020 at 4:35 pm

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను.. మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోకా భాస్కర్‌ రావు హత్య కేసులో పోలీసులు శుక్రువారం అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్తుండగా మార్గమధ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేశారు. అయితే శనివారం ఆయ‌న్ను పోలీసులు మెజిస్ట్రేట్‌ ముందుహాజరు పరిచారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, గత నెల 29న హత్యకు గురైన మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు కేసులో పోలీసులు తొలుత ముగ్గురిని అరెస్ట్ చేశారు. అందులో కొల్లు రవీంద్ర అనుచరుడు కూడా ఉన్నాడు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో కొల్లు రవీంద్ర భాగస్వామ్యం అయినట్లు తేలింది.

దీంతో మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టు భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద పోలీసులు కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకుని, అనంతరం అరెస్ట్ చేశారు.

రాజమండ్రి జైలుకు కొల్లు రవీంద్ర..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts