స్కూల్ లేదని నాన్నకు హెల్ప్ చేస్తున్న చిన్నారులు…!

July 6, 2020 at 7:31 pm

స్కూల్ లేదు, ఆడుకుంటే పోలీస్ అంకుల్స్ వచ్చి తాట తీస్తారు. బయటకు వెళ్ళే పరిస్థితి ఎక్కడా లేదు. ఎవరితో మాట్లాడే అవకాశం కూడా దాదాపుగా లేదు. ఎవరితో ఆడుకున్నా సరే ఇంట్లోనే ఉండాలి. ఆడుకోవడానికి లేకపోతే ఎం చెయ్యాలి…? చేయడానికి ఏమీ ఉండదు. చూస్తే టీవీ చూడాలి. వచ్చే ఏడాది చదువుకి ఉపయోగపడే విధంగా చదువుకుందామా…? ఎంత సేపు చదువుతాం.

చదువు మీద విరక్తి వస్తుంది. ఆడుకున్నా ఎక్కువ సేపు ఆడుకోలేని పరిస్థితి. అందుకే ఇద్దరు చిన్నారులు తమ తండ్రికి బాసటగా నిలిచి నాగలి పట్టారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఒక మీడియా కెమెరాకు ఒక ఫోటో చిక్కింది. ఆ ఫోటోలో ఏంటీ అంటే తండ్రి నాగలి దున్నుతున్నాడు. తండ్రి ముందు చేదోడు గా ఇద్దరు కొడుకులు అండగా నిలిచారు. తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తున్నారు.

పట్టణ ప్రాంతాల్లో ఐపాడ్ మినహా మరో మార్గం ఉంటుందా… కాని ఇలా ఈ ఇద్దరూ స్కూల్స్ లేకపోవడంతో తమ తండ్రికి అండగా నిలుస్తూ సహాయం చేస్తున్నారు. పొలంలో తండ్రి కలుపు తీస్తుంటే ఆయనకు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ఈ వీడియో ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అయినా పట్టణాల్లో అంటే అవి వింత గాని గ్రామాల్లో కాదు కదా మాస్టారు…?

స్కూల్ లేదని నాన్నకు హెల్ప్ చేస్తున్న చిన్నారులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts