హైదరాబాద్ లో లాక్ డౌన్ జులై 3 నుంచి…?

July 1, 2020 at 7:16 pm

హైదరాబాద్ లో కరోనా కేసుల నేపధ్యంలో ఇప్పుడు లాక్ డౌన్ ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఉన్నా సరే కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఎప్పటి నుంచి లాక్ డౌన్ ని అమలు చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. లాక్ డౌన్ ని అమలు చేసినా సరే కేసులు పెరిగే సూచనలే దాదాపుగా ఉన్నాయి అని చెప్పాలి.

ఎల్లుండు నుంచి అంటే జులై 3 నుంచి లాక్ డౌన్ ని హైదరాబాద్ లో విధించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి రేపు కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినేట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో ఇంకా కేసులు పెరిగితే మాత్రం పరిస్థితి చేయి దాటితే ఆస్పత్రులు కూడా అందుబాటులో ఉండవు.

ఇప్పటికే హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణపై అనేక విమర్శలు వస్తున్నాయి. అందుకే లాక్ డౌన్ ని అమలు చేసి ఎక్కడి వారిని అక్కడ ఆపేస్తే మంచిది అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని తెలుస్తుంది. అందుకే లాక్ డౌన్ ఎల్లుండు నుంచి ఆలు చేస్తే మంచిది అనే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు కూడా లాక్ డౌన్ కి సిద్దమవుతున్నారు అని తెలుస్తుంది.

హైదరాబాద్ లో లాక్ డౌన్ జులై 3 నుంచి…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts