చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయరు… లోకేష్ కి చేస్తే వాట్సాప్ అంటారు…!

July 21, 2020 at 6:36 pm
,

తాను చంద్రబాబుకి సింగిల్ గన్ మెన్ ఉన్నప్పటి నుంచి ఆయన వెంట తిరిగా అని కాని ఇప్పుడు ఆయన తనను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆకుల వెంకటేశ్వరరావు అనే కార్యకర్త జూబ్లీహిల్స్‌లోని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు ఆయన. ఆరు నెలలుగా ప్రయత్నిస్తుంటే కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు.

పార్టీకి పని చేసి తాను సర్వస్వం కోల్పోయానని చెప్పిన ఆయన… 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ డివిజన్‌ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయానని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్పొరేటర్‌గా ఓడిపోయిన తర్వాత వైజాగ్‌కు వెళ్లిపోయాన్న ఆయన… అప్పటి నుంచి కూడా టీడీపీతోనే ఉన్నానని కానీ ఇప్పుడు తనకు కష్టమొచ్చిందంటే పట్టించుకోవడం లేదని అసహన వ్యక్తం చేసారు.

 

చంద్రబాబును కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని చెప్పిన ఆయన… లోకేష్‌బాబుకు ఫోన్‌ చేస్తే వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టమంటాడని మండిపడ్డారు. వాట్సాప్‌లో మెసేజ్‌ పెడితే తనను పట్టించుకోవడం లేదని ఆయన కన్నీరు మున్నీరు అయ్యారు. చంద్రబాబు పర్సనల్‌ సెక్రటరీ రాజగోపాల్‌ తనను చంద్రబాబును కలవనివ్వడం లేదని మండిపడ్డారు. నెల రోజులుగా అపాయింట్‌మెంట్‌ అడుగుతుంటే ఇవాళ రమ్మన్నారన్న ఆయన… ప్రస్తుతం మూడు నెలల తర్వాత రావాలంటూ చెప్పారన్నారు

చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయరు… లోకేష్ కి చేస్తే వాట్సాప్ అంటారు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts