కరోనాలోనూ కుమ్మేస్తున్న లవ్ స్టోరి

July 1, 2020 at 9:52 am

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కి్స్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంతో మళ్లీ తన సక్సె్స్ ట్రాక్‌లోకి వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సాలిడ్ హిట్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాతోనే అందాల భామ సాయి పల్లవి తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా దూసుకుపోతుంది.

కాగా మరోసారి తనదైన మార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి శేఖర్ కమ్ముల రెడీ అవుతున్నాడు. యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్‌స్టోరి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది.

ఏదేమైనా ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.18 కోట్లకు అమ్ముడయ్యాయట. చైతూ బాక్సాఫీస్ రేంజ్‌కు ఇది చాలా మంచి రేటను చెప్పాలి. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్‌ను దక్కించుకుంటుందా అనే ఆసక్తి ప్రస్తుతం సర్వత్రా నెలకొంది.

కరోనాలోనూ కుమ్మేస్తున్న లవ్ స్టోరి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts