వరుడు ఒక్కడే.. వధువులిద్దరు.. ఈ క‌థ‌లో ఎన్ని ట్విస్టులో!!

July 11, 2020 at 8:38 am

ఈ ప్ర‌పంచంలో ఎన్నో వింతులు జ‌రుగుతుంటాయి. అందులో ఇది కూడా ఓ వింత అని చెప్పొచ్చు. ఓ యువ‌కుడు తాను ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయ‌లేక‌.. అటు కుటుంబ‌స‌భ్యులు కుదిర్చిన అమ్మాయిని బాధ‌పెట్ట‌లేక‌.. ఇద్ద‌రికీ ఒకేసారి తాళిక‌ట్టారు. ప్ర‌స్తుతం ఘ‌ట‌న నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లో బేతుల్ జిల్లాలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్ చదువుకుంటున్న టైమ్‌ ఓ యువతిని ప్రేమించారు.

స‌ద‌రు యువ‌తి కూడా సందీప్‌ను ప్రేమించింది. ఇక ప్రేమ‌లో మునిగితేలుతున్న‌ ఇద్ద‌రూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండేవారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి ప్రేమ విష‌యం కాస్త సందీప్ త‌ల్లిదండ్రుల‌కు తెలిసిందే. దీంతో వారు సందీప్‌కు వేరే పెళ్లి చేసేందుకు మరో యువతితో సంబంధం కుదుర్చుకున్నారు. అయితే సందీప్ ప్రియురాలికి ఈ విష‌యం తెలియ‌డంతో.. ఆమె గ్రామ పెద్ద‌ల‌ను ఆశ్ర‌యించింది.

దీంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు గ్రామ పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు. అయితే, ఇక్కడే మరో ట్విస్టు చోటుచేసుకుంది. తామిద్దరం అతడితోనే కలిసి జీవిస్తామని ఇద్దరు యువతులు తేల్చిచెప్పారు. అందుకు పెద్దలు కూడా ఎదురుచెప్పలేకపోయారు. ఇద్దరినీ పెళ్లాడేందుకు సందీప్ కూడా ఓకే చెప్పడంతో ఈ నెల 8న కెరియాలో బంధుమిత్రుల మధ్య వివాహం అంగ‌రంగవైభ‌వంగా జరిగింది. ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో.. వీరి పెళ్లి ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

వరుడు ఒక్కడే.. వధువులిద్దరు.. ఈ క‌థ‌లో ఎన్ని ట్విస్టులో!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts