అల్లు అరవింద్ కి “మెగా డాటర్ ” ఝలక్ !

July 11, 2020 at 3:36 pm

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత గతకొన్ని రోజులుగా నిర్మాతగా మారుతున్నారన్న వార్తలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక అందరు అనుకున్నట్లుగానే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టింది సుస్మిత‌. సుస్మిత నిర్మాతగా నేడు ఓ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. ఓయ్ సినిమాను డైరెక్ట్ చేసిన ఆనంద్ రంగ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌నున్నారు. ఇక మెగాస్టార్‌ సతీమణి, సుస్మిత తల్లి సురేఖ ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెయిన్ గెస్ట్‌గా హాజరయ్యారు.

మ‌రియు పూజ కార్యక్రమాలతో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైనది. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌బోయే ఈ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వ్య‌వ‌ధి 30 నుండి 40 నిమిషాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. మెగా త‌న‌య వెబ్ సిరీస్ అంటే… అది ఆహాలోనే స్ట్రీమింగ్ అవుతుంద‌ని అంద‌రూ ఆశిస్తారు.

కానీ, అలా జ‌ర‌గ‌లేదు. సుస్మిత త‌న వెబ్ సిరీస్‌ని జీ5కి ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన ఎగ్రిమెంట్లు కూడా పూర్త‌య్యాయి. ఇక ఆహా ఫ్లాట్ ఫామ్ కోసం వెబ్ సిరీస్‌ల‌నూ, సినిమాల్నీ వెదికి ప‌ట్టుకుని కంటెంట్ బ్యాంక్‌ని సంవృద్థి ప‌ర‌చుకోవ‌డానికి అల్లు అర‌వింద్ ఆప‌సోపాలు ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సుస్మిత వెబ్ సిరీస్ ఆహాలోనే స్ట్రీమింగ్ అయ్యుంటే అల్లు అర‌వింద్‌కు ప్ల‌స్ అయ్యేది. కానీ, సుస్మిత త‌న వెబ్ సిరీస్‌ని జీ5కి ఇవ్వ‌డంతో.. అల్లుకు మెగా షాక్ త‌గిలిన‌ట్టు అయింది.

అల్లు అరవింద్ కి “మెగా డాటర్ ” ఝలక్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts