కొత్త పాలసీ రెడీ చేసాం: త్వరలోనే సిఎంకు ఇస్తాం

July 1, 2020 at 6:43 pm

ఆంధ్రప్రదేశ్ లో వినూత్న పాలన జరుగుతుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అంటూ సరికొత్త ఆలోచనలు చేస్తుంది. ఇక తాజాగా ఏపీలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. నిర్మాణ్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీనిపై మాట్లాడిన పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సచివాలయంలో వైఎస్సార్‌ నిర్మాణ్‌ యాప్‌ను ప్రారంభించారు. సిఎం జగన్ మొదటి నుంచి చెప్పినట్లుగానే త్వరలో గొప్ప పారిశ్రామిక పాలసీని తీసుకువస్తామని ఆయన అన్నారు. పాలసీలో చెప్పిన ప్రతి ప్రోత్సాహకాన్ని అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. నూతన పారిశ్రామిక పాలసీని సిద్దం చేసి సీఎం జగన్‌కు అందజేశామని ఆయన అన్నారు.

సీఎం జగన్‌ చెప్పినట్లుగా గొప్ప పాలసీని రూపొందించినట్లు ఆయన వివరించారు. పరిశ్రమలకు పారదర్శకంగా రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎక్కువ ఉపాధి ఇచ్చే పరిశ్రమలకు మంచి రాయితీలు అందిస్తామని ఆయన అన్నారు. మూడేళ్ల పాటు నూతన పారిశ్రామిక పాలసీ అమలులో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కోవిడ్‌ పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయని ఆయన అన్నారు.

కొత్త పాలసీ రెడీ చేసాం: త్వరలోనే సిఎంకు ఇస్తాం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts