ఎమ్మెల్యేకి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన ప్రజలు

July 21, 2020 at 5:05 pm

టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే గా విజయం సాధించిన ఆ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యేకి నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు. మాట మార్చాడు అంటూ ఎమ్మెల్యేకి ప్రజలే షాక్ ఇచ్చారు. విశాఖ ఈస్ట్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు నియోజకవర్గంలోని రామకృష్ణపురంలో మంగళవారం రోజున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వెళ్ళారు. అక్కడికి ప్రజలు కూడా భారీగానే వచ్చారు.

వారు అందరూ తనను ఆప్యాయంగా ఎమ్మెల్యే గారు వచ్చారని ఆదరిస్తారు అని భావించారు. కాని అనూహ్యంగా ఎమ్మెల్యే కి అక్కడి ప్రజలు షాక్ ఇచ్చారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అధికారం మీకు లేదని నినాదాలు చేయడంతో ఆయన షాక్ అయ్యారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేయగా ప్రజలు కాస్త ఘాటుగా రియాక్ట్ అయి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్తే మంచిది అంటూ సూచించారు.

 

నాతో పాటు వచ్చి కొబ్బరికాయ కొట్టండి అంటూ ప్రజలకు కాస్త పులిహోర కల్పే ప్రయత్నం చేసినా సరే ప్రజలు ఊరుకోలేదు. మూడు రాజధానుల విషయంలో అధినేత చంద్రబాబు నైడుకి ఎమ్మెల్యే అండగా ఉండటమే దీనికి కారణం అని తెలుస్తుంది. ఒక పక్క మూడు రాజధానులను అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నా సరే ఎమ్మెల్యే మాత్రం బాబుకి వంత పాడుతున్నారు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఎమ్మెల్యేకి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన ప్రజలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts