షాకింగ్ న్యూస్‌.. ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కి కరోనా!!

July 10, 2020 at 10:51 am

గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క క‌రోనా కంటికి క‌నిపించ‌కుండానే ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతోంది. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనాకు అడ్డుక‌ట్ట ప‌డ‌క‌పోవ‌డంతో.. ల‌క్ష‌లాది మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. కరోనా వైరస్‌ ప్రతాపానికి ప్రజాప్రతినిధులు సైతం తలవంచక తప్పడంలేదు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మం‍త్రులు వైరస్‌ బారినపడ్డారు.

అలాగే మరోవైపు భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ కూడా కరోనా బారినపడ్డారు. తిరుపతిలోని స్విమ్స్ ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు. రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ రావడం.. ఆమె ఇటీవల మాస్క్ లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో.. వైసీపీ కార్యకర్తలకు క‌రోనా టెన్ష‌న్ ప‌ట్టుకోంది.

అయితే తన ఆరోగ్యంపై ఆందోళన చెందల్సిన అవసరం లేదని.. కరోనా బారినపడిన తన గన్‌మెన్ సెలవులో ఉన్నాడని రోజా తెలిపారు. 18 రోజులుగా విధులుగా రావడం లేదని చెప్పారు. దీంతో వైసీపీ కార్యకర్తలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

షాకింగ్ న్యూస్‌.. ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కి కరోనా!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts