అవినీతి చేస్తే అచ్చెం అయినా చంద్రబాబు అయినా ఒకటే…!

July 2, 2020 at 1:58 pm

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయడంపై ఇప్పుడు ఆ పార్టీ నేతలు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన బాహుబలి అని ప్రభుత్వం అందుకే భయపడి ఆయనను అరెస్ట్ చేసింది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేయడం కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ నేతలు ఇప్పుడు విమర్శలు కాస్త తీవ్రంగా చేస్తున్నారు.

అయితే ఆయన అవినీతి చేయలేదు అనే విషయం మాత్రం చెప్పడం లేదు. ఇదే విషయాన్ని వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. రాజ్యసభకు ఎన్నికైన అనంతరం శ్రీవారి దర్శనానికి గానూ ఆయన తిరుమల వెళ్ళారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేసారు. అచ్చెన్నాయుడు అవినితికి పాల్పడలేదని ఒక్క టీడీపీ నాయకుడు చెప్పడం లేదని, అరెస్ట్ పై మాత్రం మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

బీసీలను టీడీపీ ట్రంప్ కార్డుగా వాడుకుంటోందని ఆయన విమర్శించారు. అదే విధంగా అవినీతికి పాల్పడితే అచ్చెం అయినా చంద్రబాబైన అరెస్ట్ కాక తప్పదని ఈ సందర్భంగా మోపిదేవి వ్యాఖ్యలు చేసారు. బీసీలు అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న వ్యక్తి జగన్ మాత్రమే అంటూ ఆయన కొనియాడారు. నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు బీసీలకు కేటాయించారన్న ఆయన… బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేలా జగన్ పరిపాలన చేస్తుట్టు కొనియాడారు.

అవినీతి చేస్తే అచ్చెం అయినా చంద్రబాబు అయినా ఒకటే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts