
కొన్ని దశాబ్దాలు.. కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోనే ఎక్కువ అందగత్తెలు ఉన్న దేశం వెనిజులా. ప్రపంచ వ్యాప్తంగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయంటే వెనిజులా అందగత్తెలకే ఎక్కువుగా కిరిటాలు సొంతమవుతాయి. ప్రపంచంలోనే ఎక్కువ సహజ వనరులు ఉన్న దేశం వెనిజులా. ఈ భూ ప్రపచంపై ఎంతో సహజ సిద్ధ సౌందర్యాలు అక్కడే ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంజెల్ కూడా అక్కడే ఉంది. ఇక అక్కడ అడవులు గురించి… నదుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అలాంటి అందమైన దేశంలో ఇప్పుడు అడుక్కు తినే బొచ్చు కోసం కూడా మర్డర్లు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ పర్యాటకుడు కూడా అటు వైపు వెళ్లవద్దని వార్నింగ్లు ఇస్తున్నారు. చివరకు ఈ కరోనా కష్టకాలంలో శానిటైజర్లు, గ్లోవ్స్ సంగతి తర్వాత ముందు తాగడానికి 70 శాతం మందికి మంచినీళ్లు కూడా లేవు. ఇక రోజుకు కొన్ని వందల మానభంగాలు, మర్డర్లు జరుగుతున్నాయి. ఆడవాళ్లు బయటకు వస్తే సురక్షితంగా ఇంటికి వెళతామన్న గ్యారెంటీ లేదు. ఇక చాలా మంది పెళ్లి అన్న పదానికి దూరమై… శారీరక సుఖం ఏ ఆడది కనపడినా గుంపులుగా అత్యాచారం చేసేస్తున్నారు.
ఎవరికి ఎక్కడ ఏం దొరికినా ఎత్తుకు పోతున్నారు. దీనికి ప్రధాన కారాణం ఇక్కడ ప్రజలకు అన్ని ఫ్రీ గా ఇవ్వడమే. భయంకరమైన చమురు నిల్వలతో అత్యంత సంపన్న దేశంగా ఉండే వెనిజులాలో అన్నీ ఫ్రీగా ఇస్తానని 1999లో హ్యూగా చావెజ్ అధ్యక్షుడు అయ్యారు. ఆయన చమురు నిల్వలతో వచ్చిన మొత్తంతో ప్రజలకు అన్నీ ఫ్రీగా ఇవ్వడం ప్రారంభించాడు. ఆయనకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ కమ్యూనిస్టు సిద్దాంతాల ప్రకారం ఆయన ఫ్రీ కరెంట్, ఫ్రీ రేషన్, ఫ్రీ పెట్రోల్, ఫ్రీ బట్టలు ఇచ్చాడు. ఇలా అన్నీ ఫ్రీగా రావడంతో అక్కడ ప్రజలు అన్ని మాసేసి ఇళ్లల్లో కూర్చుని తినడం ప్రారంభించారు.
రైతులు వ్యవసాయం ఆపేశారు. పారిశ్రామిక వేత్తలు ఉత్పత్తులు ఆపేశారు. 2013లో చావెజ్ మరణంతో నికోలస్ మడూరో అధ్యక్షుడు అయ్యాడు. ఆయన కూడా మంచి పేరు కోసం అన్నీ ఫ్రీగా ఇవ్వడం ప్రారంభించాడు. ఇక 2014లో చమురు ధరలు తగ్గడంతో మొదలు అయిన ఆ దేశ పతనం ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. కప్పు కాపీ రు. 20 వేలు, కేజీ చిక్కుడు రు. 30 వేలకు వెళ్లిపోయాయి. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతీప్తులు చెలరేగాయి. సో ఏతావాతా చెప్పేది ఏంటంటే మన రాజకీయ నాయకులు కూడా అన్నీ ఫ్రీగా ఇచ్చేసి ప్రజలను సోమరిపోతులను చేశారు. ఇప్పుడు ప్రజలకు ఏమీ లేవు. రాజకీయ నాయకులకు, అధికారులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు భూతల నరకంగా మారిపోయింది వెనిజులా.