వరంగల్ వెళ్తా ఏంచేస్తారో చూస్తా: ఎంపీ అరవింద్

July 13, 2020 at 7:31 pm

తెలంగాణాలో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ వర్సెస్ తెరాస ఎమ్మెల్యేలుగా మారిపోయింది రాజకీయం. ఆయన వరంగల్ వెళ్ళడం, తెరాస ప్రభుత్వంపై సిఎం కేసీఆర్ పై విమర్శలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. బిజెపి ఆఫీస్ పై తెరాస కార్యకర్తలు దాడికి కూడా దిగారు. ఈ తరుణంలో ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు.

వరంగల్‌లో టీఆర్ఎస్ నేతల కబ్జాలను త్వరలో బయటపెడతానని ఆయన స్పష్టం చేసారు. హిందూమత విశ్వాసాలకు వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అదే విధంగా రానున్న కాలంలో వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, పార్టీకి ప్రజలు మంచి సమాధానం ఇస్తారని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీకి వరంగల్‌లో ఏంపని అన్న ప్రశ్నికు ఆయన సమాధానం చెప్పారు.

 

తాను భారత దేశంలో ఎక్కడైనా తిరుగుతానని వ్యాఖ్యలు చేసారు. త్వరలో మళ్లీ వరంగల్‌కు వెళతానని ఆయన పేర్కొన్నారు. ఏం చేస్తారో చేసుకోమని ఆయన సవాల్ చేసారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి కేటీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

వరంగల్ వెళ్తా ఏంచేస్తారో చూస్తా: ఎంపీ అరవింద్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts