టిక్ టాక్ బ్యాన్ పై ఎంపీ సంచలన వ్యాఖ్యలు…!

July 1, 2020 at 4:32 pm

దేశ వ్యాప్తంగా టిక్ టాక్ బ్యాన్ విషయంలో ఇప్పుడు అనేక ప్రశ్నలు వినపడుతున్నాయి. చైనా మ్యాప్ ని టార్గెట్ చేస్తే అది వదిలేసి మనం యాప్స్ ని టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు. టిక్ టాక్ ని బ్యాన్ చేయడంతో చైనా వెనక్కు తగ్గుతుందా అని చాలా మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

 

టిక్‌టాక్ కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ మాత్రమేనని ఆమె వివరించారు. టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించడం దుందుడుకు నిర్ణయమని ఆమె కొట్టిపారేశారు. అసలు చైనాను ఎదుర్కొనే వ్యూహాత్మక ప్రణాళిక ఏంటని ఆమె ప్రశ్నించారు. అదే విధంగా టిక్ టాక్ మీద ఆధారపడే వారి గురించి పలు ప్రశ్నలు వేసారు. టిక్‌టాక్‌ను నిషేధించడం వల్ల ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.

 

ఈ నిర్ణయం వల్ల చాలామంది నోట్ల రద్దు సమయంలో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ను నిషేధించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆమె… కానీ ఈ ప్రశ్నలన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారని ఈ సందర్భంగా కేంద్రాన్ని నిలదీశారు. కాగా టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

టిక్ టాక్ బ్యాన్ పై ఎంపీ సంచలన వ్యాఖ్యలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts