కృష్ణా జిల్లాలో భయపెడుతున్న వరుస హత్యలు…

July 1, 2020 at 7:11 pm

కృష్ణా జిల్లాలో ఇప్పడు వరుస రాజకీయ హత్యలు సంచలనం గా మారాయి. ఇటీవల మంత్రి పెర్ని నానీ ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు ని దుండగులు హత్య చేసారు. ఆ తర్వాత జిల్లాలో కలకలం రేగింది. ఇక ఆ హత్యను మరువక ముందే తాజాగా మరో హత్య జరిగింది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో సాంబయ్య అనే ఒక ఎంపీటీసి అభ్యర్ధిని దారుణంగా హత్య చేసారు.

ఆయన తన సొంత గ్రామానికి తిరిగి వస్తు ఉండగా ఈ హత్య జరిగింది. దీనితో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆయనను మొత్తం నలుగురు హత్య చేసారని వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు అని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడానికి గానూ ప్రత్యేక బలగాలను నియమిస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఇక ఆ హత్య ఎందుకు జరిగింది ఏంటీ అనేది ఇంకా పూర్తి సమాచారం రాలేదు.

టీడీపీ నేతలు ఈ హత్యా ఘటనపై కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. తమ మీద అధికార పార్టీ కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అని అందుకే ఈ హత్య జరిగింది అంటూ టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేసారు. ఏది ఎలా ఉన్నా సరే ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లాలో ఈ హత్యలు కలకలం రేపుతున్నాయి. జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

కృష్ణా జిల్లాలో భయపెడుతున్న వరుస హత్యలు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts