బాల‌య్య‌పై.. నగ్నం హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌..!!

July 2, 2020 at 1:16 pm

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మా కరోనా సమయంలోనూ సినిమాలు తీస్తూ.. వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల `నేకెడ్(నగ్నం)` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో విడుద‌లైన ఈ లఘు చిత్రం కూడా నిరాశ పరిచినా.. వ‌ర్మ‌కు మాత్రం కాసులు కురిపిస్తుంది. ఈ తాజా సినిమాలో స్వీటీ అనే క్యాస్టూమ్ డిజైనర్ నటించింది.

అయితే ఆమె అసలు పేరు శ్రీ రాపాక కాగా… వర్మ ఆమెను స్వీటీగా మార్చారు. ఆమెది ఆంధ్రప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లి. ఈ స్వీటీ సినీ పరిశ్రమకు కొత్త కాదు. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమె పలువురు టాప్ హీరోలు, హీరోయిన్లతో కలసి పనిచేసింది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు ఆమె ఇంటర్వూ ఇస్తూ.. బాల‌య్య‌పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

`కాస్ట్యూమ్ డిజనర్‌గా నేను చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు పనిచేశాను. ఓ సారి డిస్కషన్ కోసం నందమూరి బాలకృష్ణగారి ఇంటికి వెళ్లా. ఆయనకు కోపం ఎక్కువని అందరూ అంటారు కదా! కానీ, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. క్లీన్ మెంటాలిటీ. కాకపోతే నాలాగే కాస్త షార్ట్ టెంపర్. త్వరగా కోపం వచ్చేస్తుంది. వెంటనే చల్లారిపోతుంది. మహిళలతో ఆయన చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు` అంటూ చెప్పుకొచ్చింది.

బాల‌య్య‌పై.. నగ్నం హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts