సైకిల్‌పై వెంకీ కొడుకు.. `నార‌ప్ప` నుంచి మరో పోస్ట‌ర్..!!

July 5, 2020 at 12:18 pm

విక్టరీ వెంకటేష్ ప్ర‌స్తుతం `నారప్ప` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ ఫిలిం ‘అసురన్’కు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలు క‌లిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం చిత్తూరు, అనంతపురంలలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం లో నారప్ప భార్య సుందరమ్మగా ప్రియమణి న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న కార‌ణంగా.. ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ఇటీవల విడుదలైన వెంకటేష్ ఫస్ట్‌లుక్, ‘నారప్ప’ పోస్టర్లు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ తమ ట్విట్టర్‌ ఖాతాలో విడుద‌ల చేసింది.

ఈ సినిమాలో వెంక‌టేష్ పెద్ద కుమారుడిగా కార్తీక్ ర‌త్నం న‌టిస్తున్నాడు. ఈ రోజు ఆయ‌న పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నట్లు సురేశ్ ప్రొడక్షన్స్‌ తెలిపింది. సైకిల్‌పై కార్తీక్‌ రత్నం వెళ్తున్నట్లు ఉన్న ఈ పోస్ట‌ర్ అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా, వెంకటేష్ 74వ సినిమాగా ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో వెంకటేశ్ మధ్యవయస్కుడిగా నటిస్తున్నారు.

సైకిల్‌పై వెంకీ కొడుకు.. `నార‌ప్ప` నుంచి మరో పోస్ట‌ర్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts