
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం `రౌద్రం రణం రుధిరం`(ఆర్ఆర్ఆర్). మన్యం అడవుల్లోని అల్లూరి సీతారామరాజు, ఆదిలాబాద్ అడవుల్లోని కొమురం భీమ్ కలిస్తే ఎలా ఉండబోతోందనే ఫిక్షన్ స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై చూపించనున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు.
ఎప్పటినుంచో అందరి దృష్టీ ఈ సినిమా వైపే ఉంది. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారి ఆశలకు నీళ్లు చల్లేలా.. ఎప్పటికప్పడు ఈ సినిమా వాయిదా పడుతోంది. అయితే వాస్తవానికి చిత్ర బృందం ముందుగా ప్రకటించినట్లు జూలై 30న అంటే ఈరోజు సినిమా రిలీజ్ కావాల్సింది.
ఈ నేపథ్యంలో నెటిజన్లు.. జూలై 30, 2020 ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు. `ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా`అంటూ కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే.. మరికొందరు థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నట్లుగా ఉన్న మీమ్స్ షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. `ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫైట్లు ఇరగదీశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. క్లైమాక్స్ సూపర్‌గా ఉంది` అంటూ రివ్యూలు ఇస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.