హైదరాబాద్‌లో లాక్ డౌన్ లేనట్టేనా..??

July 5, 2020 at 8:31 am

క‌రోనా వైర‌స్‌.. ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. అగ్ర‌రాజ్యాలు సైతం క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వ‌ణికిపోతోంది. వ్యాక్సిన్ లేని క‌రోనా ఎప్పుడు ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు తెగ స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లోనూ రోజురోజుకు రికార్డు స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. అందులోనూ హైదరాబాద్ నగరంలో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఆ ఆలోచనను కేసీఆర్ సర్కారు విరమించుకున్నట్టు స‌మాచారం. ఎందుకంటే.. దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తరువాత, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఇంకో లాక్ డౌన్ ను ప్రకటిస్తే, వ్యాపారాలన్నీ తిరిగి కుదేలవుతాయని అధికారులు తమ అభిప్రాయాలను సీఎంకు వెల్లడించినట్టు సమాచారం.

అయితే క‌రోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా మరోసారి లాక్‌డౌన్‌ చేస్తేనే బాగుంటుందని కొందరు చెప్పగా, ఎంత కఠినంగా లాక్ డౌన్ ను విధించినా, వైరస్ ను అడ్డుకునే పరిస్థితి లేదని, మరోసారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడేటువంటి నిర్ణయాలు వద్దని అత్యధికులు సూచించార‌ట‌. ఇక వాస్తవానికి లాక్ డౌన్ విధించాలంటే, ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాలను సిద్ధం చేయాల్సివుంటుంది. కానీ,ఇప్పటివరకూ పోలీసు శాఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలూ అందలేదు. దీంతో లాక్ డౌన్ ఉండే అవకాశాలు లేవని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

హైదరాబాద్‌లో లాక్ డౌన్ లేనట్టేనా..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts