నేడు క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే.. ఎన్టీఆర్ ఎలా విష్ చేశాడో తెలుసా..?

July 5, 2020 at 10:50 am

తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. కేవ‌లం నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమలో తనదైన మార్క్ వేసుకున్నాడు క‌ళ్యాన్ రామ్. క్కడా తాత, తండ్రి, బాబాయి, సోదరుల పేర్లు ఎక్కడ ఎక్కువగా యూజ్ చేసుకోకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడీయ‌న‌.

ఇక నేడు క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆయ‌న పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ కూడా అన్న క‌ళ్యాణ్ రామ్‌కు విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు.`నాకు అన్నయ్యగా మాత్రమే కాదు. అంత కంటే ఎక్కవ. నాకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త కూడా. నువ్వు నిజంగా అందరికన్నా బెస్ట్. హ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా` అని ట్వీట్ చేశారు.

కాగా, గతంలో ఎన్టీఆర్ హీరోగా, కల్యాణ్ రామ్ `జై లవకుశ` చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూప‌ర్ హిట్ కూడా అయింది. ఇక తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రాన్ని కూడా క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నాడు. ప్రస్తుతం కళ్యాన్ రామ్ మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

నేడు క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే.. ఎన్టీఆర్ ఎలా విష్ చేశాడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts