గాంధీ ఆస్పత్రిలో డిమాండ్లు నెరవేర్చుకున్న నర్సులు

July 15, 2020 at 6:13 pm

ఒక పక్క కరోనా వైరస్ తో రోగులు ఇబ్బంది పడుతున్న సమయంలో తమ డిమాండ్ లు పరిష్కరించాలి అంటూ గాంధీ ఆస్పత్రిలో నర్సులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేస్తున్న ఆందోళన కాస్త ప్రజలను అయోమయానికి గురి చేసింది. గాంధీ ఆస్పత్రిలో నర్సుల కొరత ఉందనే ఆరోపణలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. కరోనా వైరస్ కు భయపడిన చాలా మంది నర్సులు విధుల నుంచి తప్పుకున్నారు.

ఇక అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇప్పుడు నిరసన చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా వారితో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపగా అవి ఫలించాయి. గాంధీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ సిబ్బందితో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు సఫలం కావడంతో వారు సమ్మె విరమించి విధుల్లో జాయిన్ అయ్యారు. కరోనా విధుల్లో ఉన్న నర్సులకు 17 వేల 500 నుంచి 25 వేల వరకు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

 

కరోనా విధుల్లో ఉన్న వారికి 750 డైలీ ఇన్సెంటివ్ ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా గాంధీ ఆస్పత్రిలో పని చేసే నాలుగో తరగతి ఉద్యోగులకు రోజుకి 300 ఇన్సెంటివ్ తో పాటుగా 15 రోజులు మాత్రమే డ్యూటి ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనితో సిబ్బంది సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. త్వరలోనే వారిని అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ లోకి మారుస్తామని హామీ ఇచ్చారు.

గాంధీ ఆస్పత్రిలో డిమాండ్లు నెరవేర్చుకున్న నర్సులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts