లోకేష్ ను ఆడుకుంటున్న కార్యకర్త

July 7, 2020 at 3:40 pm

తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో బలం చాలా ఎక్కువ అనేది ఆ పార్టీ నేతలు పదే పదే చేస్తూ ఉంటారు. కాని ఆ పార్టీ నేతలు చెప్పిన విధంగా వాస్తవ పరిస్థితులు మాత్రం గ్రౌండ్ లెవెల్ లో ఉండవు అనేది గత ఎన్నికల తర్వాత జనాలకు స్పష్టంగా అర్ధమైంది. టీడీపీ అధిష్టానం చూపించే 60 లక్షల కార్యకర్తల బలం కూడా అంత సినిమా ఏమీ లేదు అని బీమా కోసం వాళ్ళు కార్డులు చేయించుకున్నారు అంటారు.

lo

ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గత ఏడాది పార్టీ ఓటమి తర్వాత వీడియో లు పెట్టి హడావుడి చేసే కొంత మందిని చాలా బాగా ప్రమోట్ చేస్తూ వచ్చింది టీడీపీ అధిష్టానం. వాళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడి పోస్ట్ చేస్తే వారికి అన్ని విధాలుగా లోకేష్ అండగా ఉండటం తో పాటుగా వారు జైలుకి వెళ్తే వారిని బయటకు తీసుకుని వచ్చే కార్యక్రమాలను కూడా కాస్త విజయవంతంగా చేసారు.

 

ఇలా కాస్త పార్టీ నుంచి లబ్ది పొందిన విశాఖకు చెందిన ఒక కార్యకర్త ఇప్పుడు లోకేష్ ని టార్గెట్ చేసాడు. మరి ఏమైందో ఏమో తెలియదు గాని… లోకేష్ చేస్తున్న తప్పులను పదే పదే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు. అది ఏ రేంజ్ లో అంటే లోకేష్ సామర్ధ్యం మంత్రిగా ఎమ్మెల్సీ గా అసలు నాయకుడిగా ఏ విధంగా కూడా పనికిరాదు అని, దీనిని చూసి ఇతర కార్యకర్తలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. లోకేష్ కూడా అతని గురించి ఆరా తీసి కేసు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు.

లోకేష్ ను ఆడుకుంటున్న కార్యకర్త
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts