ఏపీలో ఆపరేషన్ ముస్కాన్ సూపర్ హిట్…!

July 21, 2020 at 4:43 pm

ఆంధ్రప్రదేశ్ లో బాల కార్మికులకు విముక్తి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. మంగళవారం ఆపరేష్‌ ముస్కాన్‌ కోవిడ్‌-19 ఫేజ్‌ 6వ విడత ముగింపు కార్యక్రమం డీజీపీ కార్యాలయంలో జరగగా ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ఐదు విడతల్లో జరిగిన ముస్కాన్ ఒక ఎత్తు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

ఈ సారి జరిగిన ముస్కాన్ ఇంకో ఎత్తు అని అన్నారు. వారం రోజులు జరిగిన ముస్కాన్ కోవిడ్-19 ఎంతో సక్సెస్స్ సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆపరేషన్ ముస్కాన్ బృందం పనితీరును సిఎం జగన్ అభినందించారు అని డీజీపీ అన్నారు. వేలాది మంది పిల్లలను రక్షించటం ఆనందాన్ని, తృప్తిని ఇస్తోందని అన్నారు ఆయన. ఆపరేషన్ ముస్కాన్‌తో నాలుగేళ్ళ తర్వాత తల్లి దగ్గరకి కొడుకును చేర్చామని చెప్పుకొచ్చారు.

 

కరోనా టెస్టుల ద్వారా చాలా మందిని కోవిడ్‌ నుంచి కాపాడగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ ముస్కాన్‌ను చాలెంజ్‌గా తీసుకొని పనిచేసిన సీఐడీకి అభినందనలు అంటూ కొనియాడారు. ఈ ఆపరేషన్ ద్వారా మొత్తం 4806 మందిని కాపాడామని ఆయన మీడియాకు వివరించారు. బాల కార్మికులుగా ఉన్న 278 మంది పిల్లలను రక్షించామన్న ఆయన… పట్టుబడ్డవారిలో 73 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామని చెప్పుకొచ్చారు. చిరునామా ఉన్న 4,703 మంది వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించామని అన్నారు.

ఏపీలో ఆపరేషన్ ముస్కాన్ సూపర్ హిట్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts