అమెరికాలో మ‌ళ్లీ 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు!

July 4, 2020 at 11:05 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా దెబ్బ‌కు అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాయి. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. దేశ‌దేశాలు విస్త‌రించి ప్ర‌జ‌లు ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. ఇక రోజుకు లక్ష కేసులు రావడమే డేంజర్ అనుకుంటే… ఇప్పుడు ఏకంగా రోజుకూ 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేవ‌లం నిన్న 206301 కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 11179217కి పెరిగింది.

ఈ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోదుకావ‌డానికి అమెరికా, బ్రెజిల్ ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. నిన్నమొన్నటి వరకు అమెరికాను అతలాకుతలం చేసిన మహమ్మారి ఆ తర్వాత కొంత నెమ్మదించింది. అయితే, తాజాగా మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 55 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

50 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండోరోజు. ఇక తాజా కేసుల సంఖ్య 2890350కి పెరిగింది. అలాగే నిన్న 604 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 132089కి పెరిగింది. నెల కిందటితో పోల్చితే… ప్రస్తుతం అమెరికాలో వైరస్ వ్యాప్తి రెట్టింపు అయినట్లే క‌నిపిస్తోంది.

అమెరికాలో మ‌ళ్లీ 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts