ట్విట్టర్‌లో కొత్తి రికార్డు క్రియేట్ చేసిన‌ పవన్ కళ్యాణ్!!

July 15, 2020 at 3:41 pm

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఏ రేంజ్ ఫాలోంగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ప‌వ‌న్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్చుకోవ‌డంతో పాటు.. ఎంద‌రో అభిమానుల‌ను సంపాధించుకున్నాడు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దానికి నెలన్నరకు పైగా సమయం ఉంది. అయితే ఆయన అభిమానులు ఇప్ప‌టి నుంచి సంద‌డి మొద‌లుపెట్టారు.

`#AdvanceHBDPawanKalyan` హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్టర్‌లో ట్రెండ్ చేసారు. ఈ హ్యాష్‌ ట్యాగ్ జత చేస్తూ పోటీలు పడి అభిమానులు పోస్టులు చేస్తుండడం ట్విట్ట‌ర్‌ ట్రెండింగ్‌లో ఇది రికార్డు సృష్టించింది. కేవలం 24 గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో ఏకంగా 27.3 మిలియ‌న్ల ట్వీట్లు వ‌చ్చాయి. పవన్ అభిమానులు ప్రతి ఏడాది ఇలాగే చేస్తారు.

తమ ట్వీట్లు టాప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చే వరకు ట్వీట్లు చేస్తూనే ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ పవన్ అభిమానులు హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ను టాప్ ప్లేస్‌లోకి తీసుకొచ్చారు. కాగా, ప్ర‌స్తుతం ప‌వ‌న్‌ హిందీలో హిట్టైన పింక్ సినిమాను ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు క్రిష్, హరీష్ శంకర్‌‌తో పాటు పలువురు దర్శకులతో సినిమాలు చేయడానికి కూడా ప‌వ‌న్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు.

ట్విట్టర్‌లో కొత్తి రికార్డు క్రియేట్ చేసిన‌ పవన్ కళ్యాణ్!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts