రెండు రోజుల క్రితం ఒక్క మాట మాట్లాడని పవన్ నేడు మాట్లాడారు…!

July 6, 2020 at 7:38 pm

ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి అసలు…? ఏమో అసలు అయన ఎప్పుడు ఏ విధంగా ఉంటున్నారో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఆయన మాట్లాడే మాటలు చేసే ట్వీట్ లు అన్నీ కూడా కాస్త విడ్డూరంగా మారాయి. “ఆం. ప్ర గౌరవ ముఖ్యమంత్రి- శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో

ఆరంభించడం – అభినందనీయం. అలాగే,గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు – అభినందనీయం. అని ఆయన ఒక ట్వీట్ చేసారు. నేడు ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త దూకుడుగా విమర్శించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్పు అంటూ ఎవరో విమర్శలు చేసి రాజధాని రైతులకు అండగా ఉంటామని అన్నారు.

200 రోజులు అయిన సందర్భంగా ఒక్క మాట కూడా ఆయన నుంచి రాలేదు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన నుంచి ఈ ప్రకటన చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఆయన ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు చాలా మందికి. రెండు రోజుల క్రితం మాట్లాడాల్సిన మాటలను ఇప్పుడు మాట్లాడారు. మరి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది ఆయనకే తెలియాలి.

రెండు రోజుల క్రితం ఒక్క మాట మాట్లాడని పవన్ నేడు మాట్లాడారు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts