బిగ్ బ్రేకింగ్: భారత్ చైనా సరిహద్దుల్లో మోడీ

July 3, 2020 at 10:56 am

భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. రెండు దేశాల మధ్య ఎప్పుడు అయినా ఏదైనా జరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. భారత్ వేలాది మంది సైనికులను సరిహద్దుల్లో మొహరిస్తుంది. ఇక అదే సమయంలో చైనా కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది. రెండు దేశాల మధ్య ఎప్పుడు అయినా ఏది అయినా సరే జరిగే అవకాశాలు ఉన్నాయి అని అంతర్జాతీయ మీడియా అంటున్నారు.

అదేం లేదు బీహార్ ఎన్నికల కోసం ఈ డ్రామా అని విపక్షాలు అంటున్నాయి. ఇక తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏంటీ అంటే… భారత సరిహద్దులకు ప్రధాని నరేంద్ర మోడీ అడుగు పెట్టారు. రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ వెళ్తారు అని భావించినా సరే అనూహ్యంగా లడఖ్ సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి ఆయన అడుగు పెట్టారు. దీనితో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఆయన వెళ్ళే విషయం మీడియాకు కూడా లీక్ అవ్వలేదు. ఎక్కడా కూడా మీడియాకు సమాచారం కేంద్రం గాని రక్షణ శాఖ గాని ఇవ్వలేదు. దీనితో ఆయన ఎందుకు వెళ్ళారు.. యుద్ధం వచ్చే పరిస్థితుల్లో ఆయన సైనికులకు ఏమైనా ఆదేశాలు ఇవ్వడానికి వెళ్ళారా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగాజారుతున్న తరుణంలో మోడీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన గాయపడిన సైనికులను కూడా పరామర్శించే అవకాశం ఉంది.

బిగ్ బ్రేకింగ్: భారత్ చైనా సరిహద్దుల్లో మోడీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts