పోలీసులే పోలీసులను చంపమని స్టేషన్ నుంచి ఫోన్ చేసారు…!

July 15, 2020 at 2:47 pm

వికాస్ దూబే… ఈ పేరు ఇక వినపడే అవకాశం ఉండదు. కాని అతను చేసిన ఘోరాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు అలాగే ఉన్నాయి. కాన్పూర్ లోని తన సొంత గ్రామంలో అతను 8 మందిని చంపడంతో అతని పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఇక ఇప్పుడు అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారి నుంచి ఒక్కో విషయం రాబడుతుండగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అతని సన్నిహిత అనుచరుడు శశికాంత్ పాండేను పోలీసులు విచారిస్తున్నారు. తమ వద్దకు వచ్చిన పోలీసులను చంపమని పోలీసుస్టేషన్ నుంచి సమాచారం వచ్చిందని వికాస్ చెప్పాడు అని… పోలీసులను చంపాలని దూబే ఆదేశించాడు అని అందుకే తాను కాల్పులు జరిపా అని అతను చెప్పాడు. అతనికి వరుసకు శశికాంత్ బావమరిది అవుతాడు. అతని వద్ద నుంచి తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

తాను ఒక్కడినే కాల్పులు జరపలేదు అని తనతో పాటుగా ఈ కాల్పుల్లో వికాస్ దూబే,అమర్ దూబే, ప్రభాత్ మిశ్రా, బవువా, అతుల్ దూబేలు కూడా ఉన్నారు అని పేర్కొన్నారు. అతని ఆదేశాలతో చంపడమే గాని పోలీసులకు తనకు ఏ విధమైన గొడవలు లేవు అని చెప్పాడు. ఇక అతని వాంగ్మూలం ఆధారంగా సహకరించిన పోలీసుల మీద విచారణ వేగవంతం చేసారు పోలీసులు.

పోలీసులే పోలీసులను చంపమని స్టేషన్ నుంచి ఫోన్ చేసారు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts