మంత్రి పేర్ని నాని అనుచరుడి హత్య.. అజ్ఞాతంలోకి కొల్లు రవీంద్ర..?

July 3, 2020 at 4:07 pm

ఏపీ మంత్రి పేర్ని నాని ప్రధాన అనచరుడు, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. టిడిపి నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ఉందని కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు, మోకా భాస్కరరావు కుటుంబసభ్యులు, వైసీపీ నేతలు కూడా కొల్లు రవీంద్రపై ఆరోపణలు చేస్తున్నారు

దీంతో రాజకీయంగానే కాదు మచిలీపట్నంలోని మత్స్యకార సామాజికవర్గంలోనూ కలకలం రేగింది. ఈ క్ర‌మంలోనే కొల్లు రవీంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని మోకా భాస్కరరావు బంధువులు, మత్స్యకారులు, అభిమానులు ఉల్లింగిపాలెం వాసులు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కొల్లు రవీంద్ర నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యాడు. భాస్కరరావు మున్సిపల్ చేపల మార్కెట్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. దాడిలో గాయపడిన భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మంత్రి పేర్ని నాని అనుచరుడి హత్య.. అజ్ఞాతంలోకి కొల్లు రవీంద్ర..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts