`రాధే శ్యామ్` నుంచి ప్ర‌భాస్ ఫస్ట్ లుక్ వ‌చ్చేసింది!!

July 10, 2020 at 10:33 am

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ `సాహో` త‌ర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందని.. దాదాపు 30శాతం పూర్తయిందని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా ఇదివరకే తెలిపాడు. అయితే ఈ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అప్‌డేట్ కూడా రావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నాయి.

Prabhas 20 co-starring Pooja Hegde first look announcement leaves ...

అయితే ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెట్టేసే కీలక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈనెల 10న(నేడు) పది గంటలకు విడుదల చేయనున్నామని తెలిపింది చిత్రబృందం. ఇక చెప్పిన‌ట్టుగానే ఈ సినిమా నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

Big update: Prabhas announces Prabhas20 first look date ...

సినిమా కాన్సెప్ట్‌ ను రివీల్ చేస్తున్న డిజైన్‌ చేసిన పోస్టర్‌లో ప్రభాస్‌ లుక్ వావ్‌ అనిపించేలా ఉంది. ఇక సినిమాకు చాలా రోజులు ప్రచారం అవుతున్నట్టుగా రాధే శ్యామ్‌ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ లుక్ జ‌ట్ స్పీడ్‌లో వైర‌ల్ అవుతోంది. కాగా, 1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెర‌కెక్కితోంది.

`రాధే శ్యామ్` నుంచి ప్ర‌భాస్ ఫస్ట్ లుక్ వ‌చ్చేసింది!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts