`రాధే శ్యామ్`తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న ప్రభాస్ సోదరి!!

July 11, 2020 at 11:07 am

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధే శ్యామ్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో పూజాహెగ్డే, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక జూలై 10న చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు మూవీ మేకర్స్‌. ఈ పోస్టర్‌కి విశేషమైన స్పందన లభించింది. ప్రభాస్ ఫ్యాన్స్ రాధే శ్యామ్ పోస్టర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రికార్డు సృష్టించారు.

పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఫస్ట్ లుక్ అని అర్థమవుతోంది. 1960 దశకం నాటి ప్రేమకథతో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్‌గా కనిపిస్తాడని సమాచారం. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ ఈ సినిమా ద్వారా త‌న సోద‌రి టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’కు తన సోదరి ప్రసీద ఉప్పలపాటిని నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈమె సీనియర్ హీరో కృష్ణం రాజు పెద్ద కుమార్తె. ఈ విషయం తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమోద్ తో పాటు ప్రసీద కూడా ఉన్నారు. ప్రమోద్ కూడా కృష్ణంరాజు బంధువే. నిర్మాతగా వ్యవహరిస్తూనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టే యోచనలో ప్రసీద ఉన్నారట. ప్రభాస్ తన సోదరికి పూర్తి సహకారాన్ని అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

`రాధే శ్యామ్`తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న ప్రభాస్ సోదరి!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts