షాకింగ్ న్యూస్‌.. క‌రోనాతో టాలీవుడ్‌ నిర్మాత మృతి..!!

July 4, 2020 at 12:18 pm

గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు.. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఇలా అందరికీ క‌రోనా చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. అదే స‌మ‌యంలో కొంద‌రి ప్రాణాల‌ను కూడా బ‌లితీసుకుంటోంది.

ఇక తాజాగా టాలీవుడ్ నిర్మాత, ఈతరం ఫిలిమ్స్‌ సమర్పకుడు పోకూరి రామారావు(64) ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. కరోనా సోకడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది.

వారి కుటుంబానికి ధైర్యం, ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. కాగా, బాబూ రావు నిర్మించిన సినిమాలకు సమర్పకుడిగా రామారావు ఉండేవారు. నేటి భారతం, వందేమాతరం, ఎర్ర మందారం, దేశంలో దొంగలు పడ్డారు, యజ్ఞం, రణం వంటి వంటి సినిమాలకు సమర్పకుడిగా ఉన్నారు.

షాకింగ్ న్యూస్‌.. క‌రోనాతో టాలీవుడ్‌ నిర్మాత మృతి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts