ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా..!!

July 4, 2020 at 11:27 am

క‌రోనా వైర‌స్‌.. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల మ‌నుగ‌డ‌కే గండంగా మారింది. రోజుల త‌ర‌బ‌డి లాక్‌డౌన్ విధించినా.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇక దశలవారీ లాక్‌డౌన్ ముగియడం.. అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో మహమ్మారి విజృంభణ మ‌రింత తీవ్రంగా ఉంది.

సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు.. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఇలా అందరికీ కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే పలువురు నేతలకు కరోనా వైరస్ సోకగా.. తాజాగా ఈ మహమ్మారి ఏపీలో మాజీ మంత్రికి సోకింది. బీజేపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సెల్ఫీ వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు.

నా మిత్రుడు ఒకరు కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతడితో ఇటీవల నేను కారులో ప్రయాణించాను. దాంతో నేను పరీక్ష చేయించుకోగా నాకు కూడా పాజిటివ్‌ వచ్చింద‌ని ఆయ‌న తెలిపారు. అయితే కరోనా వచ్చిందని భయపడవద్దని.. అది రాకూడని రోగం కాదని.. ప్రమాదకారి కాదన్నారు. సామాజిక దూరం పాటించకుండా ఉంటేనే కరోనా వస్తోందన్నారు. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts