`రేసుగుర్రం` మద్దాలి శివారెడ్డి క‌రోనా క‌ల‌క‌లం!!

July 14, 2020 at 2:37 pm

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. అస‌లు క‌రోనా పేరు వింటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. అంత‌లా ఈ మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది. మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. గ‌త ఏడాది చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ వారు, వీరు అని తేడా లేకుండా.. అంద‌రిని భ‌య‌పెడుతోంది.

అయితే అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `రేసుగుర్రం` చిత్రం మద్దాలి శివారెడ్డి పాత్ర‌లో చేసిన భోజ్ పురి స్టార్ రవికిషన్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. మద్దాలి శివారెడ్డిగా తెలుగు ప్రేక్ష‌కుల ‌గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న రవికిషన్.. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. బీజేపీ ఎంపీగా కూడా ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఇంట్లో క‌రోనా క‌ల‌వ‌ర‌పెడుతోంది.

త‌న పీఏ గుడ్డూ పాండే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారని… పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలిందని రవికిషన్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారని చెప్పారు. తన పీఏ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. మరోవైపు పీఏకు కరోనా సోకిందనే విషయం తెలిసిన వెంటనే రవికిషన్‌తో పాటు అతనితో కాంటాక్ట్ అయిన వాళ్లు టెస్ట్‌లు చేయించుకోవడంతో పాటు క్వారంటైన్‌కి వెళ్ళారు.

`రేసుగుర్రం` మద్దాలి శివారెడ్డి క‌రోనా క‌ల‌క‌లం!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts