బ్రేకింగ్:హైకోర్ట్ లో రఘురామ పిటీషన్…!

July 3, 2020 at 10:15 am

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన పార్టీ అధినేత, సిఎం జగన్ పై సహా మరి కొందరి పై విమర్శలు చేయడం, పార్టీ మేనిఫెస్టో పై విమర్శలు చేయడం సహా కొన్ని పరిణామాలతో ఇప్పుడు రాష్ట్రంలో ఆయన ఏదైనా రాజకీయ సంచలనంకి వేదిక అవుతారా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన వేసే అడుగులపైనే సర్వత్రా ఆసక్తి ఉంది.

 

ఇక ఆయనపై అనర్హత పిటీషన్ వేయడానికి ఎంపీలు లోక్సభ స్పీకర్ ను కలవడానికి రెడీ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ వేసి… తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని ఆయన కోరారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని పిటిషన్‌‌లో ఆయన హైకోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు.

 

తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానన్న ఆయన… వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారని చెప్పుకొచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎక్కడా పాల్పడలేదని పేర్కొన్నారు. కానీ వైసీపీ ఆ ఎంపీలు అదే కారణం చూపిస్తూ అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. మరి దీనిపై ఎప్పుడు హైకోర్ట్ విచారిస్తుంది అనేది చూడాలి.

బ్రేకింగ్:హైకోర్ట్ లో రఘురామ పిటీషన్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts