మ‌కాం మార్చేసిన రాజమౌళి.. అందుకేనా..?

July 15, 2020 at 4:03 pm

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆలియాభట్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరోవైపు ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా ఓలివియా మోరీస్ నటిస్తే.. అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ యాక్ట్ చేస్తున్నారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న స‌మ‌యంలో.. క‌రోనా దాప‌రించ‌డంతో అన్ని సినిమాల వలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గేంత వరకు షూటింగ్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. షూటింగులకు ప్రభుత్వం అనుమతించినా నటీనటులు షూటింగుల్లో పాల్గొనడానికి ముందుకు రావ‌డం లేదు.

అయితే ఇలాంటి స‌మ‌యంలో జ‌క్క‌న‌ తన మకాంను హైదరాబాద్ సిటీ నుంచి ఫామ్ హౌస్ కు మార్చారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలోని ఎదులూరు గ్రామంలో రాజమౌళికి విశాలమైన ఫాంహౌస్ ఉంది. షూటింగులు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడం, అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో రోజురోజుకు క‌రోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతుండ‌డంతో.. రాజ‌మౌళి తన మకాంను అక్కడకు మార్చార‌ని స‌మాచారం. ఇక అక్కడే తన తదుపరి సినిమాకు సంబందిచిన స్క్రిప్ట్ పనులు చూసుకోనున్నార‌ని తెలుస్తోంది.

మ‌కాం మార్చేసిన రాజమౌళి.. అందుకేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts