`ప‌వ‌ర్ స్టార్‌`లో వ‌ర్మ కూడా ఉన్నాడు‌.. మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల‌!!

July 13, 2020 at 4:15 pm

వివాదాల‌కు కేరాఫ్ అయిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం `ప‌వ‌ర్ స్టార్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన ఆయన, వరుస అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. ఇదే స‌మ‌యంలో రోజుకో పోస్ట‌రు వ‌దులుతూ.. వార్త‌ల్లో నిలుస్తున్నారు.

Image

2019 ఎన్నికల తర్వాత ప‌వ‌ర్ స్టార్.. అంటూ ఓ కాన్సెప్ట్ పై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ఎవరి గురించి కాదని వర్మ నొక్కి చెపుతున్నా.. స్టిల్స్‌, కాన్సెప్ట్ చూస్తే ఆ సినిమా ఎవరి గురించో అర్ధమైపోతోంది. ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఓ రష్యన్ మహిళ ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో వ‌ర్మ కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Image

ఆ పాత్ర పవర్ స్టార్ కు వీరాభిమానినని చెప్పుకునే ఓ నిర్మాతదని సమాచారం. అయితే, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప‌వ‌ర్ స్టార్ నుంచి మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు వ‌ర్మ‌. ఈ క్ర‌మంలోనే పవర్ స్టార్ నుంచి ఒక టెన్షన్ సన్నివేశం అని ఆయన పేర్కొన్నారు. అందులో ఒక రాజకీయ పార్టీ అధినేత ముందు కూర్చున్నట్టుగా ఫొటో ఉంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

`ప‌వ‌ర్ స్టార్‌`లో వ‌ర్మ కూడా ఉన్నాడు‌.. మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts