మంచి జోరు మీద వ‌ర్మ‌.. `ప‌వ‌ర్ స్టార్` నుంచి వ‌రుస పోస్ట‌ర్లు!!

July 9, 2020 at 4:07 pm

వివాస్ప‌ద ద‌ర్శ‌క‌డు రామ్ గోపాల్ వ‌ర్మ మొన్నటివరకు కాస్త మసాలా బోల్డ్ సినిమాలతో హడావుడి చేసి..‌ ఇప్పుడు సడన్ గా ట్రాక్ చేంజ్ చేసి ఫిలం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `ప‌వ‌ర్ స్టార్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ నిన్న (జులై 8) నుంచే ప్రారంభమైందని తెలుస్తోంది. ఇక నిన్న షూటింగ్ ప్రారంభ‌మైందో.. లేదో.. ఈ రోజు వ‌రుస పోస్ట‌ర్ల‌తో సోష‌ల్ మీడియాలో ఊపేస్తున్నాడు.

RGV reveals Power Star's first look - tollywood

ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ ప్ర‌క‌టించిన వ‌ర్మ ఈ రోజు ఉదయం 11 గంటల 37 నిమిషాలకు పవర్ స్టార్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశాడు. ఇక అక్క‌డితో ఆగ‌ని వ‌ర్మ వ‌రుస‌పెట్టి పోస్ట‌ర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే మ‌రోవైపు తాను తీస్తోన్న పవర్‌ స్టార్‌ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదని వర్మ ఇప్పటికే ప్రకటించారు.

Image

పార్టీ ప్రారంభించి, ఎన్నికల్లో ఓడిన ఓ సినీ స్టార్‌కు ఎదురైన పరిణామాల గురించి కల్పిత కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని వివరణ ఇచ్చారు. ఈ సినిమా కథ, పాత్రధారి ఏ వ్యక్తినయినా పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని ప్రకటించారు. ‘పవర్ స్టార్’ టైటిల్ మధ్యలో ఓ రాజకీయ పార్టీకి చెందిన గుర్తు గాజు గ్లాసును కూడా పెట్టారు.

Image

Image

Image

మంచి జోరు మీద వ‌ర్మ‌.. `ప‌వ‌ర్ స్టార్` నుంచి వ‌రుస పోస్ట‌ర్లు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts