
– రత్నకిశోర్ శంభుమహంతి
మెథడ్స్ అండ్ మోటివ్స్
విశ్వతత్వంతో ఆజ్ఞాపన వివేక సంబంధం
మతం-మనిషి మధ్య తెలియని
అగాధం అజ్ఞాన పూర్వకం
తెలిసీ,తెలియక నడుస్తున్న
ఆ రాజకీయానికి చేయొండొక గౌరవ వందనం
కత్తులు పూనిక వహిస్తాయి..బాధ్యతలు నిర్వర్తిస్తాయి..
ఆలయాలు సాక్ష్యంగా నిలుస్తాయి..
అవి రుధిరాశ్రువులు మోస్తాయి..
ఆ పల్లకీలకూ, కన్నీళ్లకూ తోడు ఈ నాయకులే..
అయిననూ కలడు రాముడు..కలడు శివుడు..
కలడు నా చెంత మరో రావణుడు..
ఫస్ట్ కాజ్ : ఇదమ్ వాక్యమ్..
సెకండ్ థాట్ : అయోధ్య తీరాన-
కొత్త ఆలయ నిర్మాణ ప్రాభవ ఆరంభం-
రానున్న కాలంలో అన్న వార్త చదివేక-
కారణం సవిస్తారం : విషాదాన్ని జయించే శక్తికి వీరే ప్రతినిధులు
పుడమి అల్లుడు రాముడు..అని ఒక వ్యక్తీకరణ..పుడమి చెంత, ప్రభువు చెంత రా ముడు ఓడిన తీరే బాగుంది..గెలిచిన దాఖలా నచ్చలేదు. దేశానికి ఒక్కడే రాముడు ..దేశానికి ఒక్కడే నరేంద్రుడు(ప్రియ ప్రధాని)..కోట్ల మంది ఆలయం ఎప్పుడు వెలు స్తుందా అని నిరీక్షిస్తూ, తమకూ, తమ ఇంటికీ ఒంటికీ వచ్చిన కష్టాలను మరిచిపో తున్నారు. వారిని అలానే భక్తి మార్గాన నడిపించి ఈ స నాతన తత్వ సారాలు తప్పక అందించాలి మీరు..మీరు అనగా బీజేపీ..మీరు అనగా ఏమో ఎవరి చెంత అయితే రా ముడున్నాడో వారు. తరిమే కాలాలు, కసిరే గాలులూ, విసిరే ప్రళయాలూ ఏవో ఉన్నా యని విన్నాను. అలానే ఈ రామ కథలో నెత్తుటితో తడిసిన నేలకూ,మౌనంగా ఉం టూ పోయిన చరితకూ మధ్య ఏదో అగాధం ఉందనీ విన్నాను. అలాంటివి మన కథ లకూ,మన జీవితాలకూ మధ్య ఎన్ని ఉంటే అంత మేలు అని అర్థం..రాముడున్నాడ న్న నిరూపణకు ఏళ్లు పట్టాక, లేడన్న మాట ఒకటి నెగ్గుకు వచ్చినా, రాకున్నా వ చ్చిన ఇబ్బందేం లేదు కానీ ఈ భౌతిక ప్రామాణిక రూపాలు అన్నీ నమ్మినవి, నమ్మా లి అనుకుంటున్నవి ఏమయినా సరే!తమ భక్తితత్వ నిరూపణలో ఉంటే చాలు..మ నుషులు ఎంతటి విషాదాన్ని అయినా జయించే శక్తికి వీరే ప్రతినిధులు కాగలరు.
ఆలోచనాత్మకం : ఇప్పుడు రాముడు గెలిచాడు
రానున్న ఐదో తారీఖు (ఆగస్టు మాసం, 2020) ఓ దివ్యత దేశానికి రానుంది.ఆ..తా రీఖు అంతకుముందు తారీఖు ఉత్తర ప్రదేశ్ చెంత దీపాలు దేదీప్యం కానున్నాయి. ఆ రోజు రోడ్డుకు ఆనుకుని ఎవ్వరూ బిచ్చం ఎత్తకూడదు..లేదా బిచ్చం ఎత్తినా, ఆ వా ర్త ఎక్కడా రాకూడదు. ఆ రోజు మనసంతా సకల జన హితం కోరుకున్న లేదా కోరు కోవాలి అని తపిస్తున్న లేదా జపిస్తున్న నాయకులే కళ్లెదుట కదలాడాలి..కలలో మ రియు ఇలలో ఆ కదలిక పెను నిద్దుర వదిలించి తీరాలి..అలాంటి రోజు దేశాన చిలక లు, దేశాన ఉన్నా లేనట్టుండే పులులూ,లెక్కల్లో లేని జంతువులూ, జీవులూ సకలం తమ తమ జీవన్మక్తికి ప్రధాన కారణం ఒకటి ఈ పాలకుల చర్యలే అని భావించి రా మ రామ అని అనుకుంటే మేలు. ఆ శబ్ధార్థ చంద్రికలను దేశం మొత్తం పంచే బాధ్యత బీజేపీదే! వాంగ్మయాలకూ,వాద,ప్రతివాదాలకూ శబ్ధం ఓ అడ్డుగోడ..అర్థం ఓ నిలువ నీడ. మన జీవితాల్లో అర్థం అనంతం. అనితరం కూడా! ఇలాంటి చోటు మన బాధ్యత లు భగవంతుడు నెరవేరుస్తాడు..
మన జీవితాలకు వాడే అత్యంత నమ్మకస్తుడిగా ఉం టూ మన నమ్మకాలను నిరూపించి చూపుతాడు. దేశానికి రాముడు పెద్ద దిక్కుగా ని లిచి, యుద్ధాలను నిలువరిస్తాడు. లేదా అంత్య కాల దశల్లో సోదాహరణ రీతిలో కర్తవ్య బోధ ఒకటి చేసి పోతాడు..అడవిలో రాముడు, అడవి కాదన్న చోటు రాముడు ..ఇ లాంటి రాముడు నాలుగు దిక్కులా..కోర్టు దగ్గరా..అడవుల చెంతా అగడ్తల చెంతా ఉ న్నాడొకడు..కలడు..విశాల జగతిలో..కలడు నరేంద్ర మోడీ లో..కడకు,కలడు పేదవా డిలో..ఇప్పుడు నదికి ఉపదేశ సారం ఎలా ఇవ్వాలి..మనుషులు మిగిలి చరితకు కొత్త అను అర్థం ఒకటి ఇస్తున్నారనా!లేదా మనుషులు కూడి తమ ఐక్యతకు ఈ గుడి ఓ ఆనవాలు అని అంటున్నారనా!ఏం చెబితే పాత కళలన్నీ నదులకూ, పాత అనుకు న్న వ్యథలకూ ఏమయినా శాంతి దొరుకుతుందని!ముక్తి ప్రసాదితం..భక్తి..భక్తి పూర్వ కం..ప్రసక్తి..ప్రశస్తి కూడా!రాముడు మన గొడవల్లో ఎలా ఉన్నాడు..కన్నోళ్ల కన్నీళ్లను ఓడించని రాముడు మనలోనూ ఉన్నాడు..కడివెడు నీరు దక్కని చోటు మ న కోపం దుఃఖం చెల్లుబాటు కానీయని చోటు రాముడు ఉన్నాడు..
అలా..రాముడు కొలువై, నెలవై ఉన్నాడు. అడవి అన్ని ధర్మాలకూ ఆనవాలుగా ఉంటుంది అని,యుద్ధం శాంతికి నిర్వచనం అని, దేవుడు బహువచనం కాని ఏకవచనం అని, మాలిన్య సహిత రూపా లే మనుషులంతా అని, కొయ్యబారిన బతుకులకు రాముడొక అండ అని,ఇవి పుట్ట లని, ఇవి గట్టులని,వీటిని ప్రాకృతిక సౌందర్యాలకు చిహ్నాలుగా భావించాలని కనీస స్పృహ లేని వారంతా అదిగో వెళ్తున్నారు అదిగదిగో ధర్మ సంస్థాపనకు తమదే కర్త వ్యం అని చెబుతున్నారు..పాలకులు ఇంతగా నవ్విస్తుంటే మీరెందుకు నవ్వరు ప్రజ లారా! ఈ గుడి చుట్టూ మరో రాజకీయం, ఈ గుడి చుట్టూ ప్రపంచం, ఆ నాలుగు గో డలు చు ట్టూ-మరో రక్తపాతం ఇంకా ఏవేవో ఆగి పోవాలి. లేదా ఆగిపోయిన విధంగా కనీసం నటించనయినా నటించాలి. ఇవేవీ వద్దనుకు న్న చోటు ఒకటి అయోధ్యే కా వాలి..ఇప్పుడు రాముడు గెలిచాడు అని, ధర్మం గెలిపించిందని, సత్యవర్తన నిలిచింద ని చెప్పండ్రా తప్పక విని నవ్వుతాను.
ఉద్ఘోష, వింటూ..వింటూ..
ఇటుకలు కొన్ని..దీపాలు కొన్ని..వాంగ్మయాలు కొన్ని..చేరి వస్తున్నవి అదిగో! అదిగో అయోధ్య! అదిగో మీ కల..అదిగో రూపం.. రూపాన్ని రద్దు చేయడం తగని పని.. రం గును రద్దు చేయడం తగని పని..రూపం నుంచి రంగు నుంచి ఏమయినా వివక్ష పొం దిన రోజు వాటిని తల్చుకోకపోవడం తగని పని.. ఇలాంటి చోటు రాముడున్నాడు..కొ లువై,నెలవై ఉన్నాడన్నది ప్రీతికర వాక్యం..ఇచ్ఛ కు సంబంధించిన వాక్యం.. రాము డు రాళ్లలో తేలాడు..చిర పరిచిత వాక్యంలో తేలాడు..నదిలో మునిగి శాబ్ధిక ఛాయ లు ఇవి అని చెప్పి వెళ్లాడు. అలాంటి రాముడు యుద్ధ రీతి నేర్పాడు. లేదా యుద్ధం చేయాల్సిన తీరే అసహాయతలకు అర్థం అని సంకేతించాడు. అర్థం లుప్తం అయిన చోటు దుఃఖం,కారణం లుప్తం అయిన చోటు రణం..ఇలాంటి ఉద్ఘోష, వింటూ వింటూ మీరు ఆగిపోండి. ఆలయాల నిర్మాణాల్లో ప్రభువులకు సాయం చేయండి..కొన్ని మట్టి నమూనాలు పంపి మీ ప్రాంతాలకు మీ గొంతులకు విలువ ద క్కిందని, చోటున్నది అని తప్పక మీ మీ నదీ తీరాల చెంత సంబరాలు చేసుకోండి. అలా అయితే రాము డు, అలా కాకపోయినా రాముడు సంతసాలు ఇస్తాడు..సంతసిస్తాడు కూడా!
కొలువై ఒక్కడిగా..కొలువై అందరివాడిగా..
నదులు జీవన్మరణాలు..రణాలు..రఫెల్ యుద్ధ విమానాలు..విమానాలు రెక్కలు వి ప్పని సందర్భాలు..సందర్భాలే అవి! ఆశ్చర్య చకితాలు..వెలుగు ధరహాసాలు..శ్లేష ..అనుకున్నంత..సూక్ష్మం వినిపించినంత. వివరం..అందుకున్నంత..సందర్భం శు ద్ధిలో ఉందో లేదో!కలుషిత నాగావళీ తీరాలే చెప్పాలి. ఆ రాళ్లే చెబుతాయి. ఆ నీళ్లే చె బుతాయి..అవును ఇవి కవితలకు అందని భావాలు అని ఎవ్వరు అన్నా నవ్వుకో వాలి..పోనీ మాటలకు అందని మౌనాలు అని తలిస్తే ఆ రాసిన కవిని నిలదీతకు గు రిచేయాలి. రాళ్లకు తేలియాడడం సులువు..ముంచిపోవడం కష్టం..అని అనగలమా! రాళ్లకు చరిత చెప్పడం సులువు..గీత దాటించిన చోటు రాయి ఏమయినా అడ్డు ప డిందా..అలాంటి కథ మళ్లీ ఆవృతం..పునరావృతం..హాస సంబంధం..వికటాట్ట హాస సంబంధం..శివార్పణం..ఏ తత్ వా క్ య మ్ శివార్పణం..అర్పణం అన్న మాటను వి స్తృతిలో తీసుకుని తీరకూడదు..
చాలా చిన్న చిన్న విషయాలను సైతం ప్రాణాలు త మవిగా మార్చుకుంటున్న సమయాలివి..ఆ చోట..ఈ చోట..ప్రాణార్పణ సందర్భ సహి తాలు..జీవరాహిత్య స్థితులు కలిచివేసిన ఘటనలు ఇవి కూడా రామయ్యకే ఎరుక.. కొత్త ఆలయాన..కొత్త ప్రాంగణాన..వివాదాలు లేని రాముడే విజయు డు..అని అనుకో వాలి. లేదా నరేంద్ర రాజకీయాలు ఒప్పుకోవు..యోగి రాజ్ మహారాజ్(యూపీ సీఎం) ఒప్పుకోడు. సాధు సంతతి అస్సలు ఒప్పు కోదు..గుక్కెడు నీరున్నచోటు, బుక్కెడు బువ్వన్న చోటు..భుక్తి మార్గం ఒకటి వెతికిన రోజు, సందర్భ రహిత రాముడు ఇలా ఎందుకనో గుర్తుకురాడు..ఇది రహితం..ఇది విహితం ఇది సహితం అని చెప్పడం సు లువు..గుర్తించడంలోనే బాధ్యత లేకపోవడం మనకు తెలిసిన లేదా తెలియాల్సిన వి చారం. రాముడు విచారానికి సంకేతం.. రాముడు వివాదాలకు నెలవు కాని సంద ర్భం..ఆ ఆలయాన..రాముడు కొలువై ఒక్కడిగా..కొలువై అందరివాడిగా..అని ఎలా చెప్పగలను.
ముగిస్తున్నానొక మార్నింగ్ రాగా..
మాయాన్వితాలు అయినవి,మహామోహితాలు అయినవి మనం ఐతీహ్య సారంలో వె తుక్కుని, దుర్భరావస్థలకు విరుగుడు వెత కాలి. కొన్ని బంగారు కలలకు బంగారు ఇ టుకలు తోడు, కొన్ని బంగారు కలలకు వజ్ర సంకల్పమే తోడు. అడవికి రాముడు తో డు. రాముడికి అడవి అయితే నీడ లేకపోతే కాదు. సంగ్రామం ఎలా మొదలయిందో కోర్టు తేల్చిందని అనుకోవాలి, ఎలా అనగా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని! కొత్త గు డికి కొబ్బరి కాయ కొట్టేందుకు సిద్ధం అవుతున్న వేళ రామయ్య నీడలో రసరాజ్య డో లలో ఆ నామ స్మరణ ధారణకూ, పూరణకూ కొత్త అర్థం ఏదో వెతుకుతూ,వెతుకుతూ ముగిస్తున్నానొక మార్నింగ్ రాగా…