మార్నింగ్ రాగా : ప్రియ‌మైన అందానికి..క్షేమం అని తలుస్తూ..

July 30, 2020 at 8:26 am

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

మెథ‌డ్స్ అండ్ మోటివ్స్
దేవుడూ వైద్యుడూ
ఈ యుద్ధం బాగుంటుంది
అని చ‌దివేను
దేవుడు ఉన్నంత‌లో
వైద్యుడు ఉన్న‌వాటిని మించి
ఉండాల‌న్న తాప‌త్ర‌యంలో
కొన్నింటిని
త‌న ప‌రం చేసుకోవ‌డంలో కాలాల‌ను వెచ్చిస్తారు
ఆస్ప‌త్రులు అన్నీ శ‌రీరాన్ని అర్థం చేసుకుంటున్నాయ‌న్న‌
భ్రమ‌లో దేవాల‌యాలు అన్నీ మ‌నుషుల న‌మ్మ‌కాల‌ను
నిజం అవుతాయ‌న్న భ్ర‌మ‌లో..
అంద‌మ‌యిన తార‌ల‌ను వైద్యం ఆదుకుంటుంది
అంద‌మ‌యిన లోకాల ఆవిష్క‌ర‌ణ‌కు దేవుడు మ‌రింత
ఉత్సాహంలో ఉంటాడు…ఈ అందం దేవుడి సృష్టి
ఆ వైద్యం ..దేవుడికి కొన‌సాగింపు అని విన్నాను

ఫ‌స్ట్ కాజ్ : అందాల ఐశ్వర్య క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నార‌న్న వార్త చ‌దివేక
వైద్యం న‌మ్మ‌కాల‌ను బ‌లోపేతం చేస్తుంద‌ని అనుకోలేం.. ఉన్న‌వాటిపై లోప‌లి దాక్కున్న కొన్ని రోగ కార‌కల‌పై యుద్ధం అనివార్యం అని మాత్రం చెబుతుంది. వైద్యం మ‌నిషికి ప‌రివ‌ర్త‌న కేంద్రం కానంత వ‌ర‌కూ వైద్యుడు దేవుడు కాలేడు..దేవుడూ, వైద్యుడూ ఒక్క డే అని చెప్ప‌బోను..ఇప్పుడు నానావ‌తి ఆస్ప‌త్రి అలాంటి భ‌రోసాల‌నే ఇచ్చిందా లేదా నాలుగు మాత్ర‌లు రిఫ‌ర్ చేసి న‌యం చేసి పంపి పోయిందా అన్న‌ది సందేహం.. ఐశ్వ‌ర్య ఇప్ప‌టి నుంచి త‌నను అభిమానిస్తున్న వారికి కేవ‌లం కృత‌జ్ఞ‌తలు చెల్లిస్తే స‌రిపోతుం దా..లేదా బిగ్ బీ ట్వీట్ల‌తోనే మిగ‌తా సందిగ్ధ కాలాలు నెగ్గుకురావ‌డం అన్న‌ది సామాన్యులకు సులువా! వీరంతా ఒక బాధ్య‌త‌ను నె త్తిన పెట్టుకుని జీవితాల‌ను మ‌రింత వేగ‌వంతం అయిన ప్ర‌ణాళిక దిశ‌గా న‌డిపేందుకు ప్ర‌య‌త్నిస్తే బ‌చ్చ‌న్ కుటుంబం ఇంకొంద రికి ఆద‌ర్శం అవుతుంది.

ఆ కోడ‌లి పిల్లకు అందం ఒక్క‌టే కాదు మ‌న‌స్సు కూడా ఉంది అని మ‌రికొంత కాలం చెప్పుకునేందుకు ఆ స్కారం దక్కుతుంది..అలాంటి అందం దేహాన్ని కాదు హృద‌యాన్ని ఆశ్ర‌యించిన అందం ఏమ‌యినా ఎదురువ‌స్తే త‌ప్ప‌క ఆ సౌం దర్య స‌హిత కాలాల‌ను ప్రేమించాలి..దేహంపై చెంప‌ల త‌డి పై ఏదో ఒక ర‌హ‌స్య లిపి దాగి ఉంటుంది..ఆ త‌డిని ఆ స‌డిని త‌ప్ప‌క అ ర్థం చేసుకోవాలి. ఆ లిపిని ఆరా తీయాలి.. దేహంపై వాలిన సోలిన కొన్ని క్ష‌ణాలు ఏమ‌యినా అర్థం అవుతున్నాయా..ఈ పొడిగిం పున‌కు నోచుకున్న ఆయుష్షుతో చేయాల్సింది సినిమాలేనా! ఇంకేమ‌యినా ఈ దేహంతో ఆమెకు ప‌ని ఉందా అన్న‌ది ఇప్ప‌టి ప్ర శ్న..దేహంతో కాదు మెద‌డుతోనే ప‌ని ఉండాలి.. ఆ..ఆదేశాలు అందుకుని ప‌నిచేయ‌గ‌ల‌ను తోటి వారికోసం అన్న విశ్వాసం ఒక‌టి ఐశ్వ‌ర్య నింప‌గ‌ల‌గాలి.

ఆరోగ్యంగా ఇంటికి, క్షేమంగా ఇంటికి, ఇంటికి చేరుకున్నాక మున‌ప‌టి గతం ఏమ‌యినా చెప్పిందా ఇలా ఉన్నావ‌ని, ఇప్ప‌టి వ‌ర్త మానం ఏమ‌యినా అంటుందా రేపు ఇలా ఉండ‌మ‌ని..కొన్ని సినిమాలు జీవితాన్నిచ్చాయి ఆమెకు, కొన్ని ఆమె నుంచి తీసుకో వాల్సినంత గ్లామ‌ర్ నూ, ఆన్ స్క్రీన్ హొయ‌ల‌నూ తీసుకున్నాయి.. సినిమా నుంచి తీసుకున్న‌వి కొన్ని ప‌రిమితుల మేరకు ఉం టాయి.. సినిమా ఇచ్చిన జీవితం కొన్ని అవ‌ధుల్లో ఆగిపోతాయి. జీవితం అవ‌ధికి ఆవ‌లి ఉంటుంద‌ని చెప్ప‌లేం..ఏ అవ‌ధులూ లేని అనంత విస్తృతిలో ఉన్న ఆ అందం మ‌ళ్లీ క‌నువిందు చేయ‌నుంది.. గెట్ రెడీ ఫ‌ర్ ద‌ట్ .. తెరపై మెదిలిన నీడలు,జీవితం వాకిట మె ద‌లిన నీడ‌లు బ‌తుక్కో భ‌రోసా.. అని అనుకుంటామా! ఒక‌వేళ అదే జ‌రిగిన రోజు ఐష్ ఇంత‌కుమించిన భద్ర‌త‌తోనో, భ‌రోసాతోనో త ప్పక ఉండ‌గ‌లరు..ఆస్ప‌త్రి నుంచి ఇంటికి, ఇంటి నుంచి ప్ర‌పంచం లోగిలిలోకి.. రేప‌టి నుంచి..

ఓ మ‌నిషి త‌న‌ని తాను తెలుసుకునేందుకు ఖాళీ స‌మ‌యాలు ఉప‌క‌రిస్తాయి అని చెబుతున్నారా బిగ్ బి.. అయినా త‌మ‌ను తా ము తెలుసుకునేందుకు నిత్య జీవిత సంచారంలో ఏ మూలో ఏ చోటో ఏ సంద‌ర్భ‌మో ఎందుక‌ని ఉప‌క‌రించ‌లేద‌న్న‌ది ఓ సందేహం. పేరు పోయాక, జుహూ దారిలో ఎవ్వ‌ర‌యినా ఉంటారా? అదే! బిగ్ బీ అన్న పేరుకు కోడ‌లి పిల్ల తేవాల్సినంత క్రేజ్ తీసుకురాలేక పోతే ఆ దారి వెంట వెలుగులు ఉంటాయా.. మీడియా ఉంటుందా.. పోనీ.. అంతెందుకు ముంబ‌యిలో అంత‌టి ప్ర‌శాంత జీవ‌నంకు ఒక్క‌ర‌యినా స‌హ‌క‌రిస్తారా.. మొన్న రాత్రి ఆ ఇంటి ఎదుట ఆక‌తాయిలు బైక్స్ పై వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేశార‌ని చ‌దివేను.. పోలీసు ఆ ఇంటికీ కాప‌లా, ఐశ్వ‌ర్య బ‌చ్చ‌న్ ఇంటి పేరుకూ మ‌రియు ప్ర‌తిష్టకూ ఉన్నంత కాలం, కెరియ‌ర్ ఉన్నంత కాలం కాప‌లా.. పేరు వ ‌ద్దు, కీర్తి వ‌ద్దు అనుకున్నా అనుకోనివ్వ‌ని మీడియా లో, అనుకోనివ్వ‌ని దేశంలో ఉన్నారామె.

ఐశ్వ‌ర్య క్షేమంగా ఇంటికి.. ఈ వార్త ఇచ్చిన ఆనందాల‌తో ఆమె అభిమానులు.. ఐశ్వ‌ర్య మ‌రో మారు త‌న అందంతో తెర‌పై త‌ళుకులీను సంద‌ర్బాలు ఆహ్వానిస్తూ అ భి మ నులు..ఇవ‌న్నీ జీవితం ఇచ్చిన స‌వాళ్లే క‌దా అనుకుంటూ బిగ్ బి.. ఆస్పత్రి నుంచి ఇంటి వ‌ర‌కూ ఉన్న‌వారంతా, ఇంటి నుంచి స్టూడియో వ‌ర‌కూ ఉండాల్సిన వారు ఉన్నంత వ‌ర‌కూ ఆ పేరూ ఆ కీర్తీ రెంటినీ కాపాడే క‌ర్త‌రీ, క‌ర్మ‌రీ ఐశ్వ‌ర్యనే! క‌నుక ఈ మ‌హ మ్మారులు జీవితాల‌ను పున‌రాలోచింప‌జేస్తాయి అని ఆయ‌న అంటే ఒప్పుకోండి..లేదా సంబంధిత ఆలోచ‌నలు చేయ‌డం ఇప్ప‌టి నుంచి మొద‌లుపెట్టండి.

జీవితాల్లో చావులు ప‌ల‌క‌రిస్తాయి.. చావు భ‌యాలూ సంబంధిత ఉత్ప‌రివ‌ర్త‌నాలూ చుట్టుముడ‌తాయి..ప్రేమ‌నో వాత్స‌ల్యాన్నో కా నుక గా ఇచ్చిన బిడ్డ‌ల క‌న్నీళ్లూ, ఆశ‌లూ, న‌వ్వులూ ఇలా ఎన్నో ఉన్నప‌ళాన నీవెంట‌ని ఆదేశిస్తాయి..ఈ చోట ఆగిపోవ‌డం..ఈ చో ట మొద‌లుకావ‌డం..ఈ చోటు ఆక్ర‌మిత కాలాల్లో ఉండ‌డం ఇలా ఎన్నో ఉంటాయి.. అవ‌న్నీ ఎలా ఉండ‌నీ చావు నిబ్బ‌రంగా ఉండ మని చెప్పదు..ఆస్ప‌త్రి నిబ్బ‌రంగా ఉండేందుకు స‌హ‌క‌రిస్తుందని అనుకోలేం.. ఏ వైర‌స్ వ‌చ్చినా మ‌న జీవితం త‌ట్టుకుని నిలబ డాలి, త‌ల‌బ‌డాలి అని ఏవేవో చెబుతున్నారు ఈ వైద్యులు..మ‌రి! అందాల ఐశ్వర్య ర‌క్క‌సి మూక‌ల దాడుల నుంచి దేహం లోప‌లి తిష్ట వేసిన ర‌క్క‌సి మూక‌ల దాడుల నుంచి బ‌య‌ట‌ప‌డిన వైనం నుంచి ఏం నేర్చుకుని ఉంటారు.

ఇంట్లో అంతా క్షేమం..ఇంట్లో అన‌గా జుహూ దారిలో ఉన్న బిగ్ బి ఇంట్లో అని! లేదా ఆ దారిలో ఉన్నలేదా ఉంటూ మరికొన్ని స‌వా ళ్ల‌ను చూస్తున్న జ‌యాబ‌చ్చ‌న్ లాంటి వారు కూడా క్షేమం అని.. ఇంట్లో అన‌గా ఇంటికి చేరుకున్న వారి ద‌గ్గ‌ర నుంచి ఇంటికి చేరా ల‌నుకుంటున్న వారి వ‌ర‌కూ అని కూడా అర్థం తీసుకోవాలి. అర్థం విస్తృతం అయితే జీవితం ప‌ర‌మార్థానికి తూగుతుంది. ప్రామాణి క‌తతో కూడిన చింత‌న‌కు అందుతుంది. అంతేలేని ఆనందాలు ఏవీ ఒళ్లో వ‌చ్చి వాలిపోవు కానీ ఓ తుది స్థానాన ఎవ‌రికి వారు తా మేంటో తెలుసుకునేందుకు ఓ అవ‌కాశం ఇస్తుంది. అలాంటి జీవితం, అలాంటి న‌మ్మ‌కం, అలాంటి విశ్వాసం వ‌దిలి ఆస్ప ‌త్రులకు చేరుకున్నాక కొంత అయినా ఈ ప‌రివ‌ర్త‌న గుణకాలు దేహంపై మెద‌డుపై ప‌నిచేయ‌డం మొద‌లుపెడతాయి..శ‌రీరాన్ని ఏదో ఒక‌టి పీడించుకు తిన్న సంద‌ర్భం ఉంటుంది.

దేహాన్ని స్టూడియో వెలుగులు కాల్చుకుతింటాయి.. దేహ‌పు సౌంద‌ర్యాన్ని కెమెరా క‌ళ్లు కొరుక్కు తింటాయి. దేహం నుంచి పొందాల‌నుకున్న‌వ‌న్నీ దేహం నుంచి పొంది తీరాల‌నుకున్న‌వ‌న్నీ ఆ 70ఎంఎం స్క్రీన్ ఆబ‌గా పొందే ఉంటుంది. ఇప్పుడు ఇంటికి చేరిక, లేదు ఇంటికి చేరువ.. లేదా మ‌రొక‌టి ఐశ్వ‌ర్య‌రాయ్ ఊహూ!రాయ్ తీయండి ఈ క‌న్నడి క పేరు చివ‌ర బ‌చ్చ‌న్ త‌గిలించండి.. ఇప్పుడు బిగ్ బి అను కోడ‌లు ఎలా ఉంటారు..ముంద‌రి జీవితాల ‌కు కొన‌సాగింపుగా ఉంటార ‌ని, లేదా ముందున్న జీవితాల్లో ఉన్న విషాదాలు వ‌దులుకుని ఉంటార‌ని భావించాలి.

కేరాఫ్ నానావ‌తి..కోవిడ్ కేర్ యూనిట్..దేశం మొత్తం ఆ ఆస్ప‌త్రి ఏం చెప్పినా వినాల‌నుకుంటుంది. విన్న‌వ‌న్నీ నిజం అయినా కా కున్నా విన‌డం మాత్రం ఓ విధం అయిన ప‌ద్ధ‌తిగా మార్చుకోవాల‌నుకుంటుంది. మ‌న చావులో పుట్టుక‌లో ఎంతో కొంత ప్ర‌భావితా లు ఉండి ఉంటే వాటికి అతీతంగా మ‌న జీవితాలు ఉండ‌వ‌ని నేర్చుకుని తీరాల‌ని అంటాను. ఇప్పుడు ఇంటికి ఐశ్వ‌ర్య. క‌రోనా నుం చి కోలుకుని, త‌న గారాల‌ప‌ట్టి ఆధ్య కూడా..నిన్న‌టి నుంచి రేప‌టి వ‌ర‌కూ ఆమె ఏంట‌న్న‌ది ఈ ప‌ది రోజుల కాలం చెప్పింది. లేదా ప‌ది రోజుల కాలం ఏదో ఒక‌టి ఆమెకు నేర్పి ఉంటుంది. మ‌హ‌మ్మారులు వ‌చ్చిన‌ప్పుడు, అవి పోయిన‌ప్పుడు..మ‌నుషులు కొన్ని భ‌యాల‌కూ ఉత్పాతాల‌కూ అతీతులుగా ఉండ‌లేరు.

ఇప్పుడీ మ‌హ‌మ్మారి ఆ అందాన్ని భ‌యపెట్టింది. ఆమె సున్నిత‌త్వాన్ని ప్రశ్నించింది. ఆమె లోప‌లి శ‌క్తుల నిబ్బ‌రాన్ని నిల‌దీసింది. చెప్పానుగా.. రోగ కార‌కం వేరు, ప్రేమ కార‌కం వేరు అని.. నా మాట ప్రేమ కార‌కం, ఆమె న‌డ‌వడి ప్రేమ రెట్టింపునకు కార‌ణం.. ఆమె చూపు అందుకు మరో కార‌ణం..ఇలా అందాల దేవ‌త‌ల‌ను ఆరాధిస్తే మా ట నుంచి చూపు వ‌ర‌కూ ప్రేమ నుంచి ప్రేమ వ‌ర‌కూ ఒక మ‌నిషి త‌న‌ని తాను ప‌రిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్ని స్తా డు..లేదా ఆ ప్ర‌య‌త్నంలో త‌న‌ని తాను మ‌రింత నిర్వ‌చించుకునేందుకు ప‌రిత‌పిస్తాడు. ఇప్పుడు ఇంటికి వ‌చ్చిన ఐశ్వ‌ర్య త‌న జీ వితాన్ని ఏ విధంగా చూడ‌నుంది. ఏ విధంగా ఈ మాయా లోక‌పు సౌంద‌ర్యాల‌ను అర్థం చేసుకోవాల‌నుకుంటున్న‌దీ కీల‌కం.

మార్నింగ్ రాగా : ప్రియ‌మైన అందానికి..క్షేమం అని తలుస్తూ..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts