పది రోజుల్లో రెడీ చేసుకోండి: నాకు ఆ మాట వినపడకూడదు: సిఎం జగన్

July 7, 2020 at 4:29 pm

మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది నేను అడగను… కాని నాకు రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది అనే మాట మాత్రం ఏ విధంగా కూడా వినపడటానికి వీలు లేదు. అసలు ఎవరి నోటి నుంచి కూడా ఇసుక కొరత అనే మాట మీడియా సమావేశాలో వినపడటానికి వీలు లేదు… తాజాగా అధికారులతో సిఎం వైఎస్ జగన్ ఇసుక పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇవి.

beautiful sand background

 

స్పందన కార్యక్రమంలో ఆయన జిల్లాల కలెక్టర్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక కొరత ఉండటానికి వీలు లేదు అని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు బాగా మొదలయ్యాయని, ఇసుక రీచ్‌ల్లోకి నీరు చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. కాబట్టి వచ్చే వారం పది రోజుల్లోగా కావాల్సిన ఇసుకను స్టాక్ చేసుకోవాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

 

అదే విధంగా ఇసుకకు సంబంధించి బాధ్యతలు తీసుకుంటున్న జాయింట్ కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసారు. ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇసుక బ్యాక్‌లాగ్‌ను వెంటనే క్లియర్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వచ్చే 10 రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో పెద్ద ఎత్తున ఇసుకను నిల్వ చేయాలని, ఇదే సమయంలో నాణ్యమైన ఇసుకను సరఫరా చెయ్యాలి అని స్పష్టం చేసారు.

పది రోజుల్లో రెడీ చేసుకోండి: నాకు ఆ మాట వినపడకూడదు: సిఎం జగన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts