ఆర్ఆర్ఆర్‌కు ఎన్ని కష్టాలో.. యంగ్ హీరోలు కూడానా?

July 1, 2020 at 10:26 am

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

కాగా ప్రస్తుతుం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ మిగతా చిత్రాలకంటే కూడా ఎక్కువ నష్టాన్ని ఆర్ఆర్ఆర్‌కు కలిగించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో సినీ తారలు ఎవరూ సినిమా షూటింగ్‌లలో పాల్గొనేందుకు ధైర్యం చేయడం లేదు. సీనియర్ హీరోలు అంటే పర్వాలేదు కానీ తారక్, చరణ్ లాంటి యంగ్ స్టార్స్‌కు ఏమాత్రం రిస్క్ చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఈ ఏడాదిలో షూటింగ్‌లలో పాల్గొనవద్దని వారు డిసైడ్ అయ్యారట.

ఈ వార్తతో ఆర్ఆర్ఆర్ ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ను సంక్రాంతికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి షూటింగ్‌కు బ్రేక్ పడటంతో వేసవిలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా 2021లోనే షూటింగ్ నిర్వహించాలని హీరోలు భావిస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ 2021లో కాకపోవచ్చని, దీంతో 2022లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే.

ఆర్ఆర్ఆర్‌కు ఎన్ని కష్టాలో.. యంగ్ హీరోలు కూడానా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts